‘హౌరా బ్రిడ్జ్‌’ కోసం ఎదురు చూస్తున్నాం

Eagerly Waiting Howrah Bridge Movie
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

తెలుగు సినిమాకు యువత మహారాజ పోషకులు అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యువతను ఆకట్టుకునే అంశాలు సినిమాలో ఉంటే కలెక్షన్స్‌ భారీగా వస్తాయని గతంలో పలు సినిమాలు నిరూపించాయి. యువతను ఆకట్టుకునే విధంగా సినిమాలు తీసేందుకు ఈతరం దర్శకులు ప్రయత్నాలు చేస్తున్నారు. హీరో హీరోయిన్‌ మద్య మంచి లవ్‌ ట్రాక్‌తో పాటు, మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ సీన్స్‌ ఉంటే అది చిన్న సినిమానా లేక పెద్ద సినిమానా అనే విషయాన్ని పట్టించుకోకుండా ప్రేక్షకులు ఆ సినిమాను సక్సెస్‌ చేస్తారు. త్వరలో రాబోతున్న హౌరా బ్రిడ్జ్‌ చిత్రం కూడా అలాగే సక్సెస్‌ అయ్యే అవకాశాలున్నాయని టాక్‌ చూస్తుంటే అనిపిస్తుంది. ఇటీవలే విడుదలైన రెండు టీజర్‌లు యువతను విపరీతంగా ఆకట్టుకున్నాయి. మొదటి టీజర్‌లో హీరో హీరోయిన్‌ మద్య ఉండే కెమిస్ట్రీని చూపించిన దర్శకుడు యాదు రెండవ టీజర్‌లో సినిమాలో ఉండే ఎమోషన్‌ మరియు ఎంటర్‌టైన్‌మెంట్‌ను చూపించాడు. రెండు టీజర్‌లతో పాటు సినిమా స్టిల్స్‌ కూడా విడుదల అవ్వడంతో యువత ఈ చిత్రంపై చాలా ఆసక్తి పెట్టుకుని ఎదురు చూస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఈ సినిమాకు సంబంధించిన చర్చ కూడా జరుగుతుంది. ‘హౌరా బ్రిడ్జ్‌’ కోసం ఎదురు చూస్తున్నామంటూ యూత్‌ ఆడియన్స్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. 

రాహుల్‌ రవీంద్రన్‌ మరియు ఛాందిని చౌదరి జంటగా నటించిన ఈ సినిమాలో రావు రమేష్‌ మరియు అజయ్‌లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. యూట్యూబ్‌ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఛాందిని చౌదరి ఈ సినిమాతో రెగ్యులర్‌ కమర్షియల్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంటుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు. దర్శకుడు యాదు ఈ చిత్రాన్ని చాలా నీట్‌గా, ఎంటర్‌టైన్‌మెంట్‌తో తెరకెక్కించాడు అంటూ ఇటీవలే రావు రమేష్‌ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.