చైతూ, మారుతి చిత్రం.. అప్పుడే సగం సక్సెస్‌

Naga Chaitanya Next film
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
యువ దర్శకుడు మారుతి వరుసగా విజయాలను అందుకుంటూ దూసుకు వెళ్తున్నాడు. ‘భలే భలే మగాడివోయ్‌’, ‘బాబు బంగారం’, ‘మహానుభావుడు’ ఇలా వరుసగా సక్సెస్‌లు అందుకుంటూ, ఏమాత్రం గ్యాప్‌ లేకుండా సినిమాలు చేస్తున్న దర్శకుడు మారుతి ప్రస్తుతం అక్కినేని హీరో నాగచైతన్యతో ఒక సినిమాను చేసేందుకు సిద్దం అవుతున్నాడు. నిన్న మొన్నటి వరకు ‘మహానుభావుడు’ సక్సెస్‌ను ఎంజాయ్‌ చేసిన మారుతి ప్రస్తుతం చైతూ సినిమాకు స్క్రిప్ట్‌ను సిద్దం చేసే పనిలో ఉన్నాడు. నాగచైతన్య కోసం ముందే ఒక మంచి కథను సిద్దం చేసి పెట్టిన మారుతి తాజాగా స్క్రిప్ట్‌కు తుది మెరుగులు అద్దే పనిలో ఉన్నాడు. అలాగే నటీనటుల ఎంపిక కార్యక్రమం కూడా జరుగుతుంది. 

మారుతి సినిమాలు అంటే టైటిల్స్‌ చాలా సింపుల్‌గా, ఆకట్టుకునే విధంగా, అలరించే విధంగా ఉంటాయి. టైటిల్‌తోనే సినిమా ఏంటో దర్శకుడు చెప్పేందుకు ప్రయత్నిస్తాడు. ఇప్పటి వరకు మారుతి చేసిన దాదాపు అన్ని సినిమాలు కూడా అదే విధంగా ఉన్నాయి. ఇక తాజాగా నాగచైతన్యతో చేయబోతున్న సినిమా కూడా అలాగే ఉండబోతుందని టైటిల్‌ చూస్తే అనిపిస్తుంది. ఇంతకు టైటిల్‌గా ఏం పెట్టాడో తెలుసా.. ‘శైలజ రెడ్డి అల్లుడు’ అనే టైటిల్‌ను మారుతి రిజిస్ట్రర్‌ చేయించాడు. టైటిల్‌తోనే చైతూకు మారుతి సక్సెస్‌ ఇవ్వబోతున్నాడు అంటూ తేలిపోయింది. 

మారుతి సినిమాల్లో ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫుల్‌గా ఉంటుంది. ఇక అత్తా అల్లుడుల మద్య సాగే ఎంటర్‌టైన్‌మెంట్‌ మరింత ఆసక్తికరంగా ఉంటుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. నాగచైతన్యకు అత్తగా రమ్యకృష్ణను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లబోతున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా సమంత నటించే అవకాశం ఉందని మొన్నటి వరకు ప్రచారం జరిగింది. ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. ఇటీవలే వివాహం చేసుకున్న నాగచైతన్య, సమంత కలిసి నటిస్తే సినిమా స్థాయి అమాంతం పెరిగి పోవడం ఖాయం.