టోక్యోలో భారీ భూకంపం

టోక్యోలో భారీ భూకంపం

జపాన్‌ రాజధాని టోక్యోలో గురువారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. టోక్యోలోని చిబా ఫ్రిఫెక్చర్‌లో 6.1 తీవ్రతతో భూమి కంపించిందని అధికారులు తెలిపారు. టోక్యోకు తూర్పున ఉన్న చిబా ప్రిఫెక్చర్‌లో 80 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతమైందని వాతావరణ సంస్థ తెలిపింది. ఈ భూకంప ప్రభావంతో అనేక భవనాలు కాసేపు కదిలాయి.

కానీ ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. కొన్ని కార్యాలయాల పైకప్పు భవనాలు కదిలాయి.సునామీ లాంటి ప్రమాదం సంభవించలేదని అధికారులు ప్రకటించారు. షింకాన్సెన్‌ సూపర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు టోక్యో బయటే నిలిపివేయబడ్డాయి. భూకంప ఘటనపై నూతనంగా ఎన్నికైన ప్రధాని ఫుమియో కిషిడా స్పందించారు. ‘దయచేసి ప్రజలంతా మీ ప్రాణాలను కాపాడుకునేందుకు చర్యలు తీసుకోండి’అంటూ ట్విట్‌ చేశారు.