18మంది భారతీయుల మృతి

18మంది భారతీయుల మృతి

సుడాన్ ప్రభుత్వం విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం, గ్యాస్ ట్యాంకర్లో పేలుడు ఒక పారిశ్రామిక ప్రాంతంలో మంటలను రేపింది. దీనివల్ల 23 మంది మరణించారు ఇంకా 130మందికి పైగా గాయ పడ్డారు. “ప్రాధమిక పరిశీలనలు కర్మాగారంలో అవసరమైన భద్రతా చర్యలు మరియు సామగ్రి లేకపోవడాన్ని సూచిస్తున్నాయి. అదనంగా మండే పదార్థాలను నిల్వ చేయడం” అని పిటిఐ నివేదిక తెలిపింది.

“కొంత మంది భారతీయ కార్మికులు ప్రాణాలు కోల్పోయారని, మరి కొందరు తీవ్రంగా గాయ పడ్డారని తెలుసుకున్నందుకు చాలా బాధపడ్డాను”అని విదేశాంగమంత్రి ఎస్.జైశంకర్ ట్విట్టర్ పోస్ట్‌లో పేర్కొన్నారు.

ఆసుపత్రిలో చేరిన తప్పిపోయిన లేదా విషాదం నుండి బయటపడిన భారతీయుల వివరణాత్మక జాబితాను భారత రాయబార కార్యాలయం బుధవారం విడుదల చేసింది. జాబితా ప్రకారం, ఏడుగురు ఆసుపత్రి పాలయ్యారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. పేలుడు నుండి బయటపడిన ముప్పై నాలుగు మంది భారతీయులను సలూమి సెరామిక్స్ ఫ్యాక్టరీ నివాసంలో ఉంచారు.