Election Updates: శ్రీకాళహస్తి తెదేపా అభ్యర్థిపై హత్యాయత్నం.. నిందితుడు కత్తితో

Election Updates: Assassination attempt on Srikalahasti TDP candidate.. Accused with knife
Election Updates: Assassination attempt on Srikalahasti TDP candidate.. Accused with knife

సెల్ఫీ తీసుకోవాలంటూ ఓ వ్యక్తి తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి తెదేపా అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి వద్దకు కత్తితో రావడం కలకలం సృష్టించింది. తమ నాయకుడిని హత్య చేసేందుకే నిందితుడు కత్తితో వచ్చాడని తెదేపా శ్రేణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. సుధీర్ రెడ్డి స్థానిక అయిదో వార్డు బహుదూరుపేట వద్ద ప్రచారంలో ఉండగా మహేష్ కుమార్ అనే వ్యక్తి సుధీర్ రెడ్డితో సెల్ఫీ తీసుకుంటానని పార్టీ శ్రేణులను కోరాడు.

మద్యం తాగి ఉండటంతో కాస్తంత నిశితంగా పరిశీలించగా అతడి చేతిలో కత్తి ఉండటాన్ని గుర్తించారు. ఒక్కసారిగా అప్రమత్తమై నిందితుడిని పోలీసులకు అప్పగించారు. మహేష్ కుమార్ వైకాపా సానుభూతి పరుడిగా గుర్తించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు రెండో పట్టణ సీఐ రారాజు తెలిపారు. నిందితుడు మాట్లాడుతూ శ్రీకాళహస్తి బహుదూరుపేటలో జరిగిన జాతర నిమిత్తం వచ్చానని, స్వీయభద్రత నిమిత్తం కత్తిని ఉంచుకున్నట్లు చెప్పడం అనుమానాలకు తావిస్తోంది.