Election Updates: మార్పు కావాలని తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారు: ఖర్గే

Election Updates: People of Telangana have decided to change: Kharge
Election Updates: People of Telangana have decided to change: Kharge

అధికారంలోకి రాగానే మేనిఫెస్టోను అక్షరాలా అమలుచేస్తామని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. కాంగ్రెస్‌కు అధికారం ఇవ్వాలని ఓటర్లు ఇప్పటికే నిర్ణయించుకున్నారని చెప్పారు. మార్పు కావాలని తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారని తెలిపారు. బీజేపీ నేతలు బీఆర్ఎస్​పై విమర్శలు తగ్గించేశారని.. కేసీఆర్‌, మోదీ పరస్పర విమర్శలు మానేశారని వ్యాఖ్యానించారు. హైదరాబాద్​లో అభయహస్తం పేరిట కాంగ్రెస్ మేనిఫెస్టోను ఖర్గే విడుదల చేశారు. కేసీఆర్‌కు పదవీవిరమణ సమయం వచ్చేసిందని.. ఓడిస్తే ఫామ్‌హౌస్‌లో విశ్రాంతి తీసుకుంటానని కేసీఆర్‌ అంటున్నారని వెల్లడించారు. ఓటమి తప్పదని కేసీఆర్‌కు అర్థమైపోయిందని వ్యాఖ్యానించారు.

తెలంగాణ కోసం ఎందరో ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణ కోసం ఎందరో పోరాటం చేశారు. తెలంగాణ తెచ్చిన లాభం కేసీఆర్‌ ఒక్కరే అనుభవించారు. కర్ణాటకలో 5 గ్యారంటీలను అమలు చేసి చూపిస్తున్నాం. తెలంగాణలోనూ 6 గ్యారంటీలు అమలు చేసి చూపిస్తాం. తొలి కేబినెట్‌ మీటింగ్‌లోనే 6 గ్యారంటీలను ఆమోదిస్తాం. వంద రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేసి చూపిస్తాం. కేసీఆర్‌కు టాటా..బాయ్‌బాయ్.. చెప్పి పంపిస్తాం. కాళేశ్వరం పేరిట సాగిన కుంభకోణాలను జనం అర్థం చేసుకున్నారు. అని మల్లికార్జున ఖర్గే అన్నారు.