త్రివిక్రమ్ సృష్టిలో ప్రభాస్

త్రివిక్రమ్ సృష్టిలో ప్రభాస్
Cinema News

రెబల్ స్టార్ ప్రభాస్ వరుస భారీ సినిమా లతో బిజీగా ఉన్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ సలార్ డిసెంబర్ 22 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో గ్రాండ్ రిలీజ్ కి రెడీ అయ్యింది . ఈ సినిమా పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా తో పాటుగా, కల్కి 2898AD, డైరెక్టర్ మారుతి లతో పాటుగా కొన్ని సినిమాలు లైన్ లో ఉన్నాయి.

త్రివిక్రమ్ సృష్టిలో ప్రభాస్
Trivikram and Prabhas

అయితే డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ప్రభాస్ ఒక మూవీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ మరియు త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఒక ఫ్యామిలి ఎంటర్ టైనర్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థలు అయిన యూవీ క్రియేషన్స్ మరియు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ లపై ఈ మూవీ నిర్మాణం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా కి సంబందించిన చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.