Election Updates: టీడీపీ నుండి అసెంబ్లీ బరిలో రఘురామరాజు..?

Election Updates: Raghuramaraju from TDP in the Assembly?
Election Updates: Raghuramaraju from TDP in the Assembly?

నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామరాజుకు బీజేపీ టికెట్‌ ఇవ్వని నేపథ్యంలో ఆయనకు తామే అవకాశమివ్వాలని టీడీపీ నాయకత్వం దాదాపు నిర్ణయానికి వచ్చింది. పశ్చిమ గోదావరిలో ఏదైనా అసెంబ్లీ స్థానంలో బరిలో దించాలని భావిస్తోంది. వాస్తవానికి ఆయనకు నరసాపురం లోక్‌సభ స్థానంలోనే బీజేపీ అభ్యర్థిగా అవకాశం లభిస్తుందని టీడీపీ వర్గాలు అనుకున్నాయి. కానీ అది జరగలేదు.

ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో ఏదైనా అసెంబ్లీ సీట్లో ఆయనను నిలపాలన్న ప్రతిపాదన వచ్చింది. ఆ జిల్లాలో తమ కోటా కింద వచ్చిన అన్ని అసెంబ్లీ సీట్లకు టీడీపీ ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసింది. వారిలో ఎవరినైనా ఆపి రఘురామ రాజును నిలిపితే ఎలా ఉంటుందన్నదానిపై సమాచారం సేకరిస్తున్నారు.