Election Updates: BREAKING : తెలంగాణలో జనసేన బీజేపీతో పొత్తు..ఆ సీట్లల్లో పోటీ

Election Updates: BREAKING: Janasena alliance with BJP in Telangana..Competition in those seats
Election Updates: BREAKING: Janasena alliance with BJP in Telangana..Competition in those seats

తెలంగాణలో బిజెపితో జనసేన పొత్తు కుదిరింది. ఈ తరుణంలోనే బిజెపి పార్టీ జనసేనకు కొన్ని సీట్లు కేటాయించనుంది. ఈ మేరకు ఇవాళ బిజెపి తొలి జాబితా విడుదల చేయనుంది. 55 మందితో బిజెపి లిస్ట్ రిలీజ్‌ చేయనున్నారు. తొలి జాబితాలో ముగ్గురు ఎంపిలు ఉంటారట. పెండింగ్ లో ముషీరాబాద్, అంబర్ పేట నియోజక వర్గాలు ఉండనున్నాయి.

అటు గజ్వేల్, హుజూరాబాద్ లో పోటీ చేయనున్నారు ఈటల రాజేందర్. ఈ మేరకు బిజెపి ఎంపీ లక్ష్మణ్ ప్రకటన చేశారు. మూడు రాష్ట్రాల అభ్యర్థుల ఎంపిక పై బిజెపి కేంద్ర ఎన్నికల కమిటీ చర్చించిందని.. తెలంగాణ నుంచి 50 పైగా స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక కసరత్తు పూర్తి చేసి కేంద్ర ఎన్నికల కమిటీకి అందించామన్నారు. ఏ క్షణం లో అయినా అభ్యర్థుల ప్రకటన ఉంటుందని, బిజెపి ఎంపీ లక్ష్మణ్ అభ్యర్థుల ఎంపికలో బిజెపి సామాజిక న్యాయం పాటిస్తుందన్నారు . గెలుపు గుర్రాలకే సీట్లు ఇచ్చినట్లు చెప్పారు బిజెపి ఎంపీ లక్ష్మణ్.