Election Updates: ఇప్పటివరకు తెలంగాణలో రూ.377 కోట్లు పట్టివేత..ఇదంతా ఎవరి సొమ్ము..?

Election Updates: So far Rs.377 crores have been spent in Telangana. Whose money is all this?
Election Updates: So far Rs.377 crores have been spent in Telangana. Whose money is all this?

తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన మరుక్షణం నుంచి పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడికక్కడ చెక్​పోస్టులు పెట్టి చేసిన తనిఖీల్లో ఇప్పటి వరకు రూ.377 కోట్ల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. వీటిలో నగదు, బంగారం, వెండి, మద్యం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ సొత్తంతా సామాన్యులదేనని.. ఇందులో నయా పైసా కూడా ఏ ఒక్క రాజకీయ నాయకుడిది లేకపోవడం విశేషం. మొత్తం సామాన్య ప్రజలు, వ్యాపారులదే కావడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. తగిన పత్రాలు చూపినా ఏదో ఒక కారణం చూపి నగదు, నగలు స్వాధీనం చేసుకుంటున్నారని సామాన్యులు ఆరోపిస్తున్నారు.

ఆధారాలుంటే 24 గంటల్లోనే తిరిగి ఇచ్చేస్తున్నామని చెబుతున్నా.. ఆ ప్రక్రియ మొత్తం పూర్తి చేయడానికి నానాపాట్లు పడుతున్నామని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 9వ తేదీన ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన తరువాత 28వ తేదీ వరకు రాష్ట్రంలో రూ.136.09 కోట్ల నగదు, రూ.162.07 కోట్ల బంగారు ఆభరణాలు, రూ.28.84 కోట్ల విలువైన మద్యం, రూ.18.18 కోట్ల మాదకద్రవ్యాలు, రూ.32.49 కోట్ల విలువైన వస్తు సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆదాయపన్ను శాఖ వారి లెక్కల ప్రకారం పట్టుబడిన నగదులో లెక్కలు చూపనిది రూ.2 కోట్లు మాత్రమే ఉంది.