ధరమ్ తేజ్ కి ప్రతి రోజూ పండగే

Everyday festival for dharam tej

సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా మారుతితో ఒక సినిమా చేయనున్నాడనే వార్త ప్రముఖంగా వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఈరోజు ఆ మాటని నిజం చేస్తూ ఆ ప్రాజెక్టు పట్టాలెక్కింది. ఇక ఈరోజు కొద్ది సేపటి క్రితమే ఈ సినిమా హైదరాబాద్ లోని ఒక ఆలయంలో పూజా కార్యక్రమాలను జరుపుకుంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్  మొదలెట్టనున్న ఈ సినిమాలో కథానాయికగా రాశి ఖన్నా ని ఖరారు చేశారు. త్వరలోనే నటీనటుల .. సాంకేతిక నిపుణుల వివరాలను వెల్లడించనున్నారు. చాలా గ్యాప్ తరువాత తేజుకి ‘చిత్రలహరి’తో ఓ మాదిరి సక్సెస్ లభించింది. ఈ సారి తప్పకుండా సూపర్ హిట్ కొట్టాలనే పట్టుదలతో ఆయన వున్నాడు. ఇక మారుతికి కూడా ఈ సినిమా సక్సెస్ చాలా అవసరమే. గీతా ఆర్ట్స్ 2 .. యూవీ క్రియేషన్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.