అందరిని భయపెడుతున్న మాజీ ముఖ్యమంత్రి భార్య

అందరిని భయపెడుతున్న మాజీ ముఖ్యమంత్రి భార్య
మాజీ సీఎం కుమారస్వామి భార్య రాధిక కుమార స్వామి `అరుంధతి` `భాగమతి` రేంజు లో నటిస్తున్న సినిమా అంటూ ప్రచారం ఊదరగొట్టేస్తున్నారు. తాజాగా రిలీజైన టీజర్ చూస్తే ఆ రెండు సినిమాల కాపీలానే ఉంది. రాధిక కుమారస్వామి టీజర్ లో ఎర్ర రంగు చీర,కళ్లతో భయపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. అయితే ఈ టీజర్ చూడగానే దర్శకుడు నవరసన్ పై అరుంధతి- చంద్రముఖి- భాగమతి ప్రభావం సదరు దర్శకుడిపై ఉండనే ఉందని అర్థమవుతోంది. అయితే సరిగ్గా అరుంధతి తరహాలోనే ఇందులో ఓ భీకర విలన్ ని దించారు. దీంతో సేమ్ టు సేమ్ కాపీ కొడుతున్నారా? అనే సందేహం కలుగుతోంది. అయితే కాపీ పేస్టుల కంటే కంటెంట్ లో కొత్తగా ఏం చూపిస్తాడు? అన్నదే ముఖ్యం.
కన్నడ – తమిళంలో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన పద్మిని అలియాస్ రాధిక వన్ ఫైన్ డే కర్నాటక సీఎం కుమార స్వామిని రహస్యంగా పెళ్లాడడం అప్పట్లో సంచలనమైన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత నిర్మాతగా సెటిలై ఇప్పుడు మళ్లీ ముఖానికి మేకప్ వేసుకుంటున్నారు. అందులో భాగంగానే ఈ భారీ చిత్రంలో నటిస్తున్నారట. శ్రీ లక్ష్మి వృషాద్రి ప్రొడక్షన్స్ సమర్పణలో జీఈ గీతా ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తోంది.