ఫ్యామిలీ స్టార్ దూసుకొస్తోంది!

ఫ్యామిలీ స్టార్ దూసుకొస్తోంది!
Cinema News

విజయ్ దేవరకొండ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా యువ దర్శకుడు పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్. ఈ లవ్, ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ నుండి ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ అందరినీ ఆకట్టుకుని సినిమా పై మంచి అంచనాలు ఏర్పరిచాయి. గోపి సుందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. విషయం ఏమిటంటే, వాస్తవానికి ఈ మూవీని రానున్న 2024 సంక్రాంతి కానుకగా ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించారు.

ఫ్యామిలీ స్టార్ దూసుకొస్తోంది!
Vijay Devarakonda

అయితే కొన్నాళ్ల క్రితం సినిమా కి సంబంధించి జరగాల్సిన అమెరికా షెడ్యూల్ వీసాల ఆలస్యం కారణంగా వాయిదా పడినట్లు న్యూస్ వైరల్ అయింది. ఇక లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం అతి త్వరలో ఈ షెడ్యూల్ ని అమెరికాలో గ్రాండ్ గా జరిపి, అనంతరం మిగతా బ్యాలెన్స్ వర్క్ ని కూడా వేగంగా పూర్తి చేసి పక్కాగా ముందుగా ప్రకటించిన విధంగా సంక్రాంతి కానుకగా సినిమా ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ గట్టిగా ప్లాన్ చేస్తున్నారట. గీత గోవిందం అనంతరం మరొక్కసారి విజయ్, పరశురామ్ ల కలయికలో వస్తున్న ఈ మూవీ ఎంతమేర ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందో తెలియాలి అంటే మరొక రెండు నెలలు ఆగాల్సిందే.