కన్న కొడుకునే కిరాతకంగా చంపిన తండ్రి

కన్న కొడుకునే కిరాతకంగా చంపిన తండ్రి

మద్యం మత్తు ఓ తండ్రిని హంతకుడిని చేసింది. కన్న కొడుకునే కిరాతకంగా చంపేలా చేసింది. టెక్కలిలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చో టు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరా లు ప్రకారం.. టెక్కలి మేజర్‌ పంచాయతీ పరిధి స్థానిక భూలోకమాత వీధికి చెందిన బిసాయి నాగ రాజు  అతని తండ్రి లవకుశలు నిత్యం మద్యం సేవించి ఇంట్లో తగాదా పడుతుంటారు.

శుక్రవారం రాత్రి కూడా ఇద్దరూ గొడవ పడ్డారు. కొడుకు తనపై విరుచుకుపడడం తట్టుకోలేని తండ్రి వంట గదిలో కూరగాయలు కోసే కత్తితో నాగరాజు కడుపు, ఛాతీ కింద భాగంలో బలంగా పొడిచాడు. దీంతో అతను ఒక్కసారిగా కింద పడిపోయాడు. వెంటనే అతని తల్లి దమయంతి, చెల్లి మాలతిలు 108కు సమాచా రం అందించి టెక్కలి జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే నాగరాజు చనిపోయినట్లు వైద్యు లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న టెక్కలి ఎస్‌ఐ ఎన్‌.కామేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకు ని వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు.