ఎలుగుబంటిని కుక్కను తరిమినట్టు తరిమింది.. వీడియో

fearless dog chases away bear video

సాధారణంగా ఎవరినైనా బయపెట్టించి ఉరికిస్తే ఏమంటాం. కుక్కను తరిమినట్టు తరిమారు అంటాం. మరి.. కుక్కే తరిమితే.. అప్పుడు కూడా కుక్కను తరిమినట్టే అనాలి కదా. ఎందుకంటే నిజంగానే ఓ కుక్క.. ఎలుగుబంటిని తరిమింది. మామూలు గీమూలు తరమడం కాదది. కుక్క వెంబడించడంతో బతుకు జీవుడా అంటూ ఆ ఎలుగు పరుగు లంకించుకుంది. ఈ ఘటన యూఎస్‌లోని న్యూజెర్సీలో చోటు చేసుకున్నది.

ఓ వ్యక్తి ఇంటి పేరట్లోకి వచ్చిన ఎలుగుబంటి.. అక్కడ అన్ని వస్తువులను చిందర వందర చేసింది. పక్షులకు పెట్టే ఫుడ్‌ను తినేసింది. ఇంతలోనే ఆ ఇంటికి కాపలాగా ఉండే కుక్క.. ఎలుగు రావడాన్ని గమనించి.. దాన్ని తరిమేసింది. దీంతో ఎలుగు అక్కడి నుంచి తుర్రుమంది. ఈ ఘటన అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఆ వీడియోను ఆ ఇంటి ఓనర్.. తన ఫేస్‌బుక్ ఖాతాలో షేర్ చేశాడు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.