మొదటి చంద్రగ్రహణం ఇదే

మొదటి చంద్రగ్రహణం ఇదే

2020 సంవత్సరానికి గాను మొదటి చంద్రగ్రహణం ఇదే.. అయితే ఈ సంవత్సరంలో మొత్తం ఆరు గ్రహణాలు ఏర్పడనున్నాయి. అందులో నాలుగు చంద్రగ్రహణాలు అయితే మరో రెండు సూర్య గ్రహణాలు. ఇక ఈ ఏడాదిలో మొట్టమొదట ఏర్పడే గ్రహణం చంద్రగ్రహణం ఇదే. ఇది జనవరి 10వ తేదీ రాత్రి అంటే ఈరోజు 10.37 గంటలకు ప్రారంభమై జనవరి 11వ తేదీ తెల్లవారుజాము 2.42 గంటల వరకు ఈ చంద్రగ్రహణం కొనసాగనుంది.

జూన్‌ 5, జూలై 5, నవంబర్‌ 30 తేదీల్లో మరో మూడు చంద్రగ్రహణాలు సంభవించనున్నాయి. కాగా ఈ చంద్రగ్రహణం రోజు కొన్ని నియమాలు తప్పక పాటించాల్సి ఉంటుంది. ఆ నియమం ఏంటంటే.. గ్రహణం సమయంలో ఎలాంటి ఆహారా పదార్థాలను తీసుకోకూడదు. ఎలాంటి పానీయాలను తాగకూడదు. గర్భిణీ స్త్రీలు గ్రహణం సమయంలో బయటకు అస్సలు రాకూడదు..

పదునైన వస్తువులను, కత్తులను గర్భిణులు దగ్గరగా ఉంచుకోకుండా జాగ్రత్త పడాలి. గ్రహణం సమయంలో ఎట్టి పరిస్థితులలోను మద్యాన్ని సేవించకూడదు. అలాగే ఎవరైనా సరే గ్రహణాన్ని నేరుగా చూడకూడదు.. ఎందుకేనట గ్రహణ సమయంలో ప్రతిబింబించే కిరణాలూ చాల శక్తి వంతంగా ఉంటాయి. అందుకే గ్రహణాన్ని నేరుగా చూడకూడదు. చూశారుగా ఈ నియమాలు తప్పక పాటించండి.