“ఈగిల్” నుండి మొదటి పాట ప్రోమో విడుదల

Eagle Movie

మాస్ మహారాజ రవితేజ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ఈగిల్. ఈ సినిమా ని సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన ప్రమోషన్స్ ని వేగవంతం చేయడం జరిగింది. ఈ సినిమా కి సంబందించిన ఫస్ట్ సింగిల్ రేపు సాయంత్రం 6:03 గంటలకు రిలీజ్ కానున్నది . తాజాగా ఈ ఫస్ట్ సింగిల్ కి సంబందించిన ప్రోమో ను రిలీజ్ చేశారు.

"ఈగిల్" నుండి మొదటి పాట ప్రోమో విడుదల
Eagle Movie

ఆడు మచ్చా అంటూ సాగే ఈ ప్రోమో విశేషం గా ఆకట్టుకుంటుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబోట్ల నిర్మిస్తున్న ఈ చిత్రం లో అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ లు లేడీ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. దవ్ జంద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.