Abn ఛానల్ వీధిలోకి వెళ్లాలంటే సినీ జనాలకు హడల్.

Flop-Sentiment-Behind-House

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

సినిమా ఫీల్డ్ లో సెంటిమెంట్స్ ఎంత బలంగా వుంటాయో వేరే చెప్పక్కర్లేదు. అజ్ఞాతవాసి సినిమా ఫలితం కూడా అలాంటి ఓ సెంటిమెంట్ ని ఫిలిం ఇండస్ట్రీలో బలపడేట్టు చేసింది. దీంతో ఇప్పుడు abn ఛానల్ అంటే సినీ జనాలు హడలెత్తిపోతున్నారు. సినిమా వాళ్ళు ఆ ఛానల్ లో కూర్చుని కమ్మగా కబుర్లు చెబుతుంటే ఇదేమిటి ఇలా చెబుతున్నారు అనేగా మీ అనుమానం.

abn ఛానల్ హైదరాబాద్ ఫిలిం నగర్ లో వుంది. ఈ ఛానల్ వున్న వీధిలో సినిమా ఫీల్డ్ కి సంబంధించిన కొందరు సెలెబ్రిటీలు ఇల్లు కట్టుకున్నారు. అలా అక్కడ కట్టుకున్న ఇంట్లోకి వచ్చాక సక్సెస్ అన్నది కానరాకుండా పోయిందట. భారీ చిత్రాల నిర్మాత అశ్వనీదత్, బెల్లంకొండ సురేష్ లాంటి వాళ్లకి ఆ వీధిలోకి వచ్చాకే సక్సెస్ కోసం ఎంత కష్టపడ్డా ప్రయోజనం లేకుండా పోయిందట. ఇప్పుడు అజ్ఞాతవాసి తో అపజయం తో పాటు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న దర్శకుడు త్రివిక్రమ్ కూడా అదే వీధిలో ఇల్లు కట్టుకున్నాడు. ఇంటీరియర్ వర్క్ చురుగ్గా సాగుతోంది.

ఇంతలో అజ్ఞాతవాసి ఫలితం తో ఎదురు దెబ్బ తిన్న త్రివిక్రమ్ కూడా పునరాలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. ఈ ఇంట్లోకి రావడం మీద ఆయన వెనకడుగు వేసే అవకాశం ఉందని కూడా టాక్ వినిపిస్తోంది. తన సినిమాల్లో లాజిక్ ని నమ్ముకునే త్రివిక్రమ్ తెర వెనుక పూజలు, హోమాలు వంటి మ్యాజిక్స్ ని బాగా నమ్ముతారట. ఇప్పుడు గనుక త్రివిక్రమ్ అదే తరహాలో ఆలోచించి కొత్త ఇంటికి గుడ్ బై కొడితే మాత్రం abn ఛానల్ వీధి లోకి ఇక సినిమా వాళ్ళు ఎవరూ అడుగు పెట్టే ధైర్యం చేయరేమో!