గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్

గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్

గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి కేశుభాయ్‌ పటేల్‌ కరోనా వైరస్‌ బారిన పడ్డారు. శుక్రవారం ఆయనకు రాపిడ్ యాంటీజెన్ పరీక్ష చేయించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో పూర్తి స్థాయి పరీక్షల కోసం ఆయన సీటీ స్కాన్ చేయించడంతో పాటుగా, ఆర్టీ-పీసీఆర్ టెస్టుల కోసం శాంపిల్స్ పంపించినట్టు గాంధీనగర్‌ సివిల్‌ హాస్పిటల్‌ పూపరింటెండెంట్‌ డాక్టర్‌ తెలిపారు.

92 ఏళ్ల పటేల్‌కు ఇంతకు ముందు బైపాస్ సర్జరీ జరిగిందని, అలాగే ప్రొస్టేట్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నారని ఆయన తనయుడు భరత్‌ తెలిపారు. ఇది తమకు ఆందోళన కలిగిస్తుందన్నారు. ప్రస్తుతం ఆయనకు ఎటువంటి కారోనా లక్షణాలు లేవని వెల్లడించారు. ఇటీవల కేశుభాయ్ పటేల్ వద్ద పనిచేసే వ్యక్తిగత సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో.. వారి నుంచే ఆయనకు కరోనా వచ్చి ఉంటుందని కుటుంబ సభ్యులు అభిప్రాయపడుతున్నారు.