బస్సులో మరణించిన మాజీ ఎమ్మెల్యే

former mla died in bus

మాజీ ఎమ్మెల్యే, కర్నాటక కాంగ్రెస్ సీనియర్ నేత బస్సులో గుండెపోటుతో మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. 1999, 2008లో ఉడిపి నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందిన గోపాల్ భండారి(66) నేడు కేఎస్ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ గుండెపోటుతో హఠాన్మరణం పాలయ్యారు. అత్యంత సాధారణ జీవితం గడిపే ఆయన నేడు బస్సులో బెంగుళూరు నుంచి మంగుళూరు వెళ్లేందుకు బస్సెక్కారు. అయితే బస్సు మంగుళూరు చేరుకున్నప్పటికీ ఎంతకీ భండారీ లేవకపోవడంతో డ్రైవర్ దగ్గరికెళ్లి గమనించాడు. అయితే అప్పటికే భండారీ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆయనను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే భండారీ మృతి చెందినట్టు పోలీసులు వైద్యులు వెల్లడించారు. పేదల మనిషిగా పేరున్న ఆయన మరణంతో ఉడిపి ప్రజలు విషాదంలో మునిగిపోయారు. ఆయన హార్ట్ ఎటాక్ వలెనే చనిపోయారని చెబుతున్నారు.