తెలంగాణ మహిళలకు మరో గుడ్ న్యూస్. ఇకపై ఆధార్ లేకున్నా కూడా బస్సుల్లో ప్రయాణించవచ్చు. అయితే ఆధార్ కార్డు స్థానంలో ఏదైనా గుర్తింపు కార్డు అంటే ఓటర్ ఐడీ డ్రైవింగ్ లైసెన్స్ వంటి గుర్తింపు కార్డులను చూపించవచ్చ. తెలంగాణలో మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు జీరో టికెట్ కోసం ఆధార్ ఉంటె చాలా అని ఒక నెటిజన్ ఎండీ సజ్జనార్ ను అడగగా దీనికి బదులుగా సమాధానం ఇచ్చారు సజ్జనార్. ఉచిత ప్రయాణానికి గుర్తింపు ఆధార్ కార్డుకు బదులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డును చూపించి ప్రయాణించవచ్చని ప్రకటించారు.