హెచ్‌ఐవీ బాధితురాలిని వదలని కామాంధులు… గ్యాంగ్ రేప్  

Gangsters don't leave HIV victim ... gang rape

హెచ్‌ఐవీ బాధితురాలిని వదలని కామాంధులు ఆమె గ్యాంగ్ రేప్ కి తెరబడ్డారు. బర్త్ డే పార్టీకి వెళ్లిన యువతిపై దారుణంగా నలుగురు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెపై దాడి చేసి అఘాయిత్యానికి ఒడిగట్టారు. మహారాష్ట్రలో ఈ నెల 14న జరిగిన దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఈ ఘటన మీద కేసు నమోదు చేసిన పోలీసులు ఆ నలుగురు నిందితుల కోసం గాలిస్తున్నారు.  ఔరంగాబాద్‌ సమీపంలోని గ్రామానికి చెందిన యువతికి హెచ్‌ఐవీ సోకింది. దీంతో ఆమె తండ్రి ఔరంగాబాద్‌లో ఉండే సోదరుడి దగ్గరకు పంపించాడు. ఆమె సోదరుడితో కలిసి అక్కడే నివాసం ఉంటోంది.

యువతిని ఔరంగాబాద్‌లో ఉండే స్నేహితురాలు పుట్టినరోజు వేడుకలకు ఆహ్వానించింది. ఈమె కూడా స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. అయితే ఈ నెల 14న యువతి సోదరుడు తండ్రికి ఫోన్ చేసి.. ఆమెకు ఆరోగ్యం సరిగా లేదని ఇక్కడి నుంచి తీసుకెళ్లమని చెప్పాడు. కొడుకు ఫోన్ చేయడంతో ఔరంగాబాద్ వెళ్లిన తండ్రి ఆమెను సొంత ఊరికి తీసుకెళ్లాడు.

ఆమె ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడంతో ఆస్పత్రిలో చేర్చాడు. డాక్టర్లు ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించి అత్యాచారానికి గురైనట్లు తేల్చారు. దీంతో ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితురాలిని ప్రశ్నించిన పోలీసులు ఏం జరిగిందని ఘటనపై ఆరా తీశారు.

స్నేహితురాలి పుట్టిన రోజు వేడుకలకు వెళ్లినప్పుడు నలుగురు అత్యాచారం చేసినట్లు చెప్పింది. నలుగురు తనపై దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయని అందుకే వారిని గుర్తు పట్టలేకపోయాని చెప్పడంతో బాధిత యువతి చెబుతున్న ఆధారాల ప్రకారం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.