నయీం కేసులో టీడీపీ మాజీ ఎమ్మెల్యే పేరు ?

Name of former TDP MLA in Naeem case?

హత్యలు, అఘాయిత్యాలు, భూకబ్జాలు, సెటిల్‌మెంట్లతో తెలుగు రాష్ట్రాల్లో గ్యాంగ్‌స్టర్‌గా చెలామణి అయిన నయీంను మూడేళ్ల క్రితం తెలంగాణ పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. 2016, ఆగస్టు 8 షాద్‌నగర్‌ శివారులోని మిలీనియం టౌన్‌షిప్‌లో పోలీసులు అతడిని కాల్చి చంపారు.

ఉదయం వేళ ఒక్కసారిగా వందల మంది పోలీసులు టౌన్‌షిప్‌ను చుట్టుముట్టడంతో స్థానికులు బెదిరిపోయారు. ఏం జరుగుతుందో తెలిసేలోగానే పోలీసులు నయీం గ్యాంగ్‌ను కాల్చి చంపేశారు. కరుడుగట్టిన నేరస్థుడైన నయీం తమ ఇళ్ల మధ్యే ఉంటున్నాడని తెలిసి స్థానికులు షాక్‌కు గురయ్యారు. అప్పటి నుంచి అతడి కేసు విచారిస్తున్న పోలీసులకు ఎన్నో సంచలన విషయాలు వెలుగులోకి తెచ్చారు.

అయితే ఈ కేసు దర్యాప్తుపై ఇప్పటికీ చాలామందికి అనేక అనుమానాలున్నాయి. నయీం కేసులో అసలు ఎవరెవరి పేర్లున్నాయో తెలుసుకునేందుకు ‘ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌’ అనే సంస్థ సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) ద్వారా వివరాలు రాబట్టింది. ఆ సంస్థ సేకరించిన నివేదికలోని పేర్లు చూసి ఇప్పుడు అందరూ నోరెళ్లబెడుతున్నారు.

ప్రజాప్రతినిధులతో పాటు అనేక మంది పోలీసుల పేర్లు కూడా అందులో ఉన్నాయి.  ఈ కేసులో ప్రమేయమున్న వారి పేర్లు మాజీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య, అడిషనల్‌ ఎస్పీలు.. శ్రీనివాసరావు, చంద్రశేఖర్‌, అమరేందర్‌రెడ్డి, డీఎస్పీలు శ్రీనివాస్‌, సాయిమనోహర్‌రావు, శ్రీనివాసరావు, ప్రకాష్‌రావు, వెంకటనర్సయ్య,

పంజాగుట్ట ఏసీపీ తిరుపతన్న, ఇన్స్‌పెక్టర్లు మస్తాన్‌, శ్రీనివాసరావు, మాజీద్‌, వెంకట్‌రెడ్డి, వెంకటసూర్యప్రకాష్‌, రవికిరణ్‌రెడ్డి, బల్వంతయ్య, బాలయ్య, రవీందర్‌, నరేందర్‌గౌడ్‌, దినేష్‌, సాదిఖ్‌మియా వంటి వారి పేర్లు ఉన్నాయని ఆ సంస్థ బయట పెట్టింది.