సుమ, రాజీవ్ కనకాల ఇంట తీవ్ర విషాదం

the-tragedy-of-suma-and-rajiv-kanala

ప్రముఖ నటుడు, దర్శకుడు, నట శిక్షకుడు దేవదాస్ కనకాల కన్నుమూశారు.కొంతకాలంగా అనారోగ్యంతో కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కనకాల నాటక దర్శకత్వం నుండి సినిమా దర్శకునిగా ఎదిగారు.వందకు పైగా సినిమాలలో నటించిన ఆయన పూణే ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో విద్య అభ్యసించిన తొలితరం తెలుగువారిలో ఒకరు కాగా ఆయన కుమారుడు రాజీవ్ కనకాల నటుడిగా కోడలు టీవీ రంగంలో ప్రముఖ యాంకర్ గా అందరికీ సుపరిచితులే.

కాగా అడయార్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ (మద్రాస్) లో ఎ.ఆర్.కృష్ణ సారథ్యంలో నడిచిన ఆంధ్రప్రదేశ్ రిపర్టరీలోను, మధు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లోను అధ్యాపకునిగా మరియు తెలుగు విశ్వవిద్యాలయం రంగస్థల కళలశాఖలో అధ్యాపకునిగా, శాఖాధిపతిగా పనిచేశారు. ప్రస్తుతం ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే నట శిక్షణాలయాన్ని స్థాపించి అనేక వర్థమాన నటులను తీర్చిదిద్దుతున్నారు.

నట శిక్షణ ఇవ్వడంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. రజనీకాంత్‌, చిరంజీవి, రాజేంద్ర ప్రసాద్‌, శుభలేఖ సుధాకర్, నాజర్‌, ప్రదీప్ శక్తి, భానుచందర్‌, అరుణ్‌పాండ్యన్‌, రాంకీ, రఘువరన్ వంటి సినీ నటులతోపాటు, టీవీలో ఉన్న నటులంతా దేవదాస్ కనకాల వద్ద నట శిక్షణ పొందినవారే.