వికారాబాద్ జిల్లాలో పేలుడు

వికారాబాద్ జిల్లాలో పేలుడు

వికారాబాద్ జిల్లా పరిగిలో ఓ ఇంట్లో వంట గ్యాస్ పేలుడు స్థానికంగా కలకలం సృష్టించింది. పరిగి మండలం మిట్టకోడూరు గ్రామానికి చెందిన దేశమోని యాదమ్మ పరిగి మార్కెట్ యార్డు దగ్గర ఓ ఇంట్లో అద్దెకు ఉంటుంది. వంట వండేందుకు స్టవ్ వెలిగించగా.. అప్పటికే గ్యాస్ లీకై ఉండడంతో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో యాదమ్మ  తీవ్రంగా గాయపడింది. స్థానికులు వెంటనే బాధితురాలిని పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యాదమ్మకు తీవ్ర గాయాలుండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఇంటి గోడలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.