మద్యం మత్తులో డ్రైవింగ్…యువతీ ప్రాణం బలి

మద్యం మత్తులో డ్రైవింగ్...యువతీ ప్రాణం బలి

అతి వేగం… మద్యం మత్తులో డ్రైవింగ్ ఓ యువతి ప్రాణం తీసింది. కుటుంబ సభ్యులకు తెలియకుండా.. స్నేహితులతో కారులో వరంగల్‌కి వచ్చిన ఓ యూవతి కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. మంచిర్యాల జిల్లా కొత్తపల్లి గ్రామానికి చెందిన సింధు, రాకేశ్  వరంగల్‌కి చెందిన హార్షవర్థన్ దగ్గరకు వచ్చారు. తిరుగు ప్రయాణంలో కారు డివైడర్‌ను ఢీ కొట్టి  బోల్తా కొట్టింది. దీంతో సింధు తలకు తీవ్ర గాయాలయ్యాయి. మూడు రోజుల పాటు ప్రాణాలతో పోరాడిన ఆ యువతి చివరికి ప్రాణాలు విడిచింది. తమకు తెలియకుండా తమ కుతురుకి మాయ మాటలు చెప్పి వరంగల్‌కి తీసుక వచ్చి.. చావుకు కారణమైన..ఇద్దరు యువకులపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితురాలి కుటుంబసభ్యులు.