పాకిస్తాన్ చీప్ ట్రిక్స్…విమర్శల వర్షం

పాకిస్తాన్ చీప్ ట్రిక్స్...విమర్శల వర్షం

అప్పుల్లో కూరుకుపోతున్న పాకిస్తాన్‌ పెట్టుబడిదారులను ఆకర్షించడానికి చేసిన ఓ ప్రయత్నం అంతర్జాతీయంగా మరోసారి పరువు తీసింది. పాకిస్తాన్‌కు చెందిన ఎస్‌సీసీఐ ఓ ఇన్వెస్టర్ల సదస్సును అజర్‌ బైజాన్‌ దేశ రాజధాని బకూలో నిర్వహించింది. పెట్టుబడి అవకాశాల సదస్సుతో  నిర్వహించిన ఈ కార్యక్రమం ఈ నెల 4 నుంచి 8 వరకు జరిగింది. అయితే అక్కడికి వచ్చిన పెట్టుబడిదారులను ఆకర్షించడానికి ఈ కార్యక్రమంలో బెల్లీ డాన్స్‌ను ఏర్పాటు చేసింది.  దీనిని పాక్‌ జర్నలిస్టు ఒకరు.. వీడియోతో సహా ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. అది కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. బెల్లీ డ్యాన్సర్లతో అశ్లీల నృత్యాలు చేయించడాన్ని ఆ దేశ ప్రజలే తీవ్రంగా తప్పుబడుతున్నారు. భారత్‌ చంద్రయాన్‌-2 మిషన్‌లో నిమగ్నమై ఉంటే.. పాక్‌ మాత్రం బెల్లీ మిషన్‌ను సమర్థంగా నిర్వహించిందంటూ ఎద్దేవా చేస్తున్నారు. మరికొందరైతే.. పెట్టుబడులు ఆహ్వానానికి పాక్‌ కొత్తమార్గం కనుగొందంటూ ట్వీట్‌ల వర్షం కురిపిస్తున్నారు.