సమ్మెకు సిద్ధమయిన ఆర్టీసీ

సమ్మెకు సిద్ధమయిన ఆర్టీసీ

ఆర్టీసీ సమస్యలపై తెలంగాణ మజ్దుర్ యూనియన్ సమ్మెకు సిద్ధమయ్యింది. సమ్మె నోటీసులు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు యునియన్ సభ్యులు. బడ్జెట్ సమావేశాల సమయంలోఅసెంబ్లీ హల్లో రవాణా శాఖ మంత్రి అజయ్‌ని ఆర్టీసీ గుర్తింపు సంఘం నేతలు కలిసి సమస్యలు వివరించారు. తమ సమస్యలను పరిష్కరించాలని ఇప్పటికే మూడు యూనియన్లు ఆర్టీసీ యాజమాన్యంకు సమ్మె నోటీసులు ఇచ్చారు. ఆర్టీసీలో జీతాల సవరణ, ఉద్యోగుల భర్తీ, కార్మికులకు మందుల సరఫరాతో పాటు, పనిభారం తగ్గించాలనే అంశాలతో పాటు అనేక విషయాల పై అసెంబ్లీ లాబీల్లో రవాణా శాఖ మంత్రి అజయ్ తో గుర్తింపు సంఘం నేతలు చర్చలు జరిపారు. తెలంగాణలో ఆర్టీసీ పరిస్థితిని వివరించారు. ఇవాళ సమ్మె నోటీసులు ఇచ్చే ఆలోచనలో తమ యూనియన్ ఉందని స్పష్టం చేసినట్లు సమాచారం.