గీత గోవిందంపై దర్శకేంద్రుడి ఆసక్తికర కామెంట్స్‌

Geetha-Govindam-is-copy-of-

టాలీవుడ్‌లో ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా గీత గోవిందం గురించి మాట్లాడుకుంటున్నారు. సామాన్యులతో పాటు సెలబ్రెటీలు కూడా ఈ చిత్రంకు ఫిదా అయ్యారు. చిన్న బడ్జెట్‌తో రూపొంది పెద్ద విజయాన్ని సాధించిన ఈ చిత్రం ప్రస్తుతం టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా ఉంది. రికార్డు స్థాయిలో వసూళ్లను సాధించిన చిత్రంగా చరిత్రలో నిలిచి పోబోతుంది. ఇప్పటికే గీత గోవిందం చిత్రం ఏకంగా 50 కోట్ల షేర్‌ను క్రాస్‌ చేసింది. లాంగ్‌ రన్‌లో 60 కోట్లను వసూళ్లు చేయడం ఖాయంగా చెబుతున్నారు. ఇలాంటి సమయంలో దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ఈ చిత్రం గురించి చేసిన వ్యాఖ్య ఒకటి సోషల్‌ మీడియాలో మరియు సినీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతుంది.

 Geetha Govindam

‘గీత గోవిందం’ చిత్రాన్ని కాపీ చిత్రం అంటూ రాఘవేంద్ర రావు అన్నాడు. తాను చేసిన ‘పెళ్లి సందడి’ చిత్రం తరహాలోనే ఈ చిత్రం కూడా చిన్న బడ్జెట్‌తో రూపొంది, ఏమాత్రం అంచనాలు లేకుండా ప్రేక్షకు ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక సినిమా కూడా పెళ్లి నేపథ్యంలో కొనసాగుతూ వస్తుంది. అందుకే పెళ్లి చూపులు చిత్రానికి గీత గోవిందం చిత్రం కాపీ అంటూ రాఘవేంద్ర రావు చమత్కరించాడు.

ragavandhra

ఇటీవలే ప్రత్యేక షో ద్వారా గీత గోవిందం చిత్రాన్ని చూసిన రాఘవేంద్ర రావు సినిమా స్థాయిని మరింతగా పెంచేలా వ్యాఖ్యలు చేయడం జరిగింది. పెళ్లి సందడి చిత్రాన్ని కూడా గతంలో అల్లు అరవింద్‌ నిర్మించిన విషయం తెల్సిందే. నిర్మాత విషయంలో కూడా గీత గోవిందం చిత్రం పెళ్లి సందడి చిత్రానికి కాపీ అని ఆయన కామెడీగా వ్యాఖ్యలు చేశాడు.