గీత గోవిందం రిలీజ్ డేట్ – ఆగష్టు 15

geetha govindam Release On August 15

న‌టీన‌టులు : విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మందాన్న, నాగ‌బాబు, సుబ్బ‌రాజు, వెన్నెల కిషోర్‌, రాహుల్ రామ‌కృష్ణ‌, గిరిబాబు, అన్న‌పూర్ణ‌మ్మ‌, మౌర్యాని, సుభాష్‌, అభ‌య్‌, స్వ‌ప్న‌క‌, స‌త్యం రాజేష్‌, దువ్వాసి మెహ‌న్‌, గుండు సుద‌ర్శ‌న్‌, గౌతంరాజు, అనీష‌, క‌ళ్యాణి , సంధ్య జ‌న‌క్ త‌దిత‌రులు…
స‌మ‌ర్ప‌కులు.. అల్లు అర‌వింద్‌
నిర్మాత‌.. బ‌న్నివాసు
క‌థ‌-స్క్రీన్‌ప్లే-మాట‌లు-ద‌ర్శ‌క‌త్వం… ప‌రుశురామ్‌
సంగీతం.. గోపిసుంద‌ర్‌
సినిమాటోగ్రాఫ‌ర్‌.. మ‌ణికంద‌న్‌
ఎడిట‌ర్‌.. మార్తాండ్‌ కె వెంక‌టేష్
లిరిక్స్‌.. అనంత్ శ్రీరామ్‌, శ్రీమ‌ణి,

విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా నటించిన ‘గీత గోవిందం‘ భారీ అంచనాలతో విడుదలకు సిద్ధమవుతోంది. ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకురానున్న ఈ సినిమా గీతాఆర్ట్స్ లో శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు లాంటి ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్ తో విజ‌యం సాధించిన ప‌రుశురాం(బుజ్జి) ద‌ర్శ‌క‌త్వంలో రూపొందింది. ప్రోడ్యూస‌ర్ బ‌న్నివాసు నిర్మాణంలో ఎస్ ప్రోడ్యూస‌ర్ శ్రీ అల్లు అర‌వింద్ గారు స‌మ‌ర్ప‌ణ‌లో GA2 PICTURES బ్యాన‌ర్ లో ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి గోపి సుంద‌ర్ సంగీతం అందిస్తున్నారు. “గీత గోవిందం” సినిమా లోని ఇంకేం ఇంకేం కావాలే సాంగ్కి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ చిత్రాన్ని అగ‌ష్టు 15న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తున్నారు.