ఝాన్సీ రిలీజ్ డేట్ – ఆగష్టు 3

jyothika jhansi Release On August 3

నటీనటులు : జ్యోతిక, జీవీ ప్రకాష్, రాక్‌లైన్ వెంకటేష్, ఇవానా
దర్శకుడు : బాలా
నిర్మాతలు : కోనేరు కల్పన, డి.అభిరాం అజయ్‌కుమార్
బ్యానర్ : కల్పనా చిత్ర & యశ్వంత్ మూవీస్
మ్యుజిల్ : ఇళయరాజా
నిర్మాణం : బీ స్టూడియోస్
సినిమాటోగ్రఫీ : ఈశ్వర్

తమిళంలో విడుదలై భారీ విజయం సాధించిన నాచియార్ చిత్రం తెలుగులో ఝాన్సీ పేరుతో విడుదలకు సిద్ధం అయ్యింది. జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా కోనేరు కల్పన మరియు డి.అభిరాం అజయ్‌కుమార్ కలిసి కల్పనా చిత్ర మరియు యశ్వంత్ మూవీస్ బ్యానర్ ద్వారా సంయుక్తంగా ఆగస్టు 3న విడుదలకు అన్ని ఏర్పాట్లుచేస్తున్నారు.
ఎన్నో వైవిధ్య చిత్రాలను మనకందించిన దర్శకుడు బాల జ్యోతికతో నాచియార్ సినిమా తీసి విడుదల చేయడంతో తమిళనాడులో ఘన విజయం సాధించింది. ఇందులో జ్యోతిక ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్‌లో కనబడుతుంది.సినిమాలో ఇళయరాజాగారి సంగీతం మరో హైలైట్. జి.వి.ప్రకాష్ మరో కీలక పాత్రలో కనిపిస్తారు.