ఇక ఆశలన్నీ గోవిందంపైనే..!

This Film Is Hopeful On Geeta Govindam Movie Release On Augest 15

విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన జంటగా పరుశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గీత గోవిందం’. ఈ చిత్రంపై యూత్‌లో ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఆగస్టు 15న విడుదల కాబోతున్న ఈ చిత్రం తప్పకుండా అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుందనే నమ్మకంతో సినీ వర్గాల వారు ఉన్నారు. ఇక ఈచిత్రంకు పోటీ అనుకున్న శ్రీనివాస కళ్యాణం మరియు విశ్వరూపం 2 చిత్రాు సో సోగానే ఉన్నాయి. ముఖ్యంగా శ్రీనివాస కళ్యాణం చిత్రం వల్ల గీత గోవిందంకు పోటీ తప్పదని అంతా భావించారు. కాని నితిన్‌ ఆకట్టుకోవడంలో విఫలం అయ్యాడు. గత కొన్నాళ్లుగా పెద్ద సినిమా ఏదీ కూడా ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్‌ కాలేదు. శ్రీనివాస కళ్యాణం ఫ్లాప్‌ అయినా ఆ లోటును గీత గోవిందం చిత్రం పూడ్చుతుందని సినీ వర్గాల వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

This Film Is Hopeful On Geeta Govindam Movie Release On Augest 15

అర్జున్‌ రెడ్డి చిత్రం తర్వాత విజయ్‌దేవరకొండ స్థాయి అమాంతం పెరిగి పోయింది. దాంతో గీత గోవిందం చిత్రంను అన్ని ఏరియాల్లో కూడా మంచి బిజినెస్‌ అయ్యింది. ఇప్పటికే విడుదలైన టీజర్‌ మరియు ట్రైలర్‌ సినిమా స్థాయిని పెంచేశాయి. హీరోయిన్‌ రష్మిక మందన పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందని, హీరో విజయ్‌ దేవరకొండ గోవిందంగా మెప్పిస్తాడు అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు. మెగా ప్రొడక్షన్స్‌ నుండి రాబోతున్న ఈ చిత్రంకు ప్రమోషన్స్‌ కూడా భారీగా చేస్తున్నారు. ఆకారణంగానే ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది. శ్రీనివాస కళ్యాణం, విశ్వరూపం 2 చిత్రా లు విడుదల అయ్యి ఆకట్టుకోలేక పోవడంతో ఇప్పుడు అందరి దృష్టి గీత గోవిందం చిత్రంపైనే ఉన్నాయి.