విశ్వరూపం 2 రివ్యూ & రేటింగ్ – తెలుగు బుల్లెట్

vishwaroopam-2--review

నటీనటులు: కమల్ హాసన్, రాహుల్ బోస్, పూజా కుమార్, ఆండ్రియా, శేఖర్ కపూర్, వహెద రహమాన్, తదితరులు

దర్శకుడు: కమల్ హాసన్

రచయిత: కమల్ హాసన్, అతుల్ తివారీ

నిర్మాత: కమల్ హాసన్, ఎస్.చంద్ర హాసన్

సినిమాటోగ్రఫీ: సను వార్గేసే

సంగీతం: గిబ్రాన్

విశ్వరూపం సినిమాలో విశ్వ నటుడు కమల్ హాసన్ నట విశ్వరూపమే కాక ఆయన టేకింగ్ స్టైల్ కూడా రుచి చూసాం. అయితే, అయిదేళ్ళ సుదీర్గ విరామం తరువాత మల్లి ఇప్పుడు విశ్వరూపం2 థియేటర్స్ లో సందడి చెయ్యడానికి, అలానే మరోసారి ఆశ్చర్యపరచడానికి సిద్ధం అయ్యింది. ఈ రోజు సినిమా రిలీజ్ అయ్యింది. అయితే, నిజంగా సినిమా ఆశ్చర్యపరిచిందా లేక నిరుత్సాహ పరిచిందా అన్నది మాట్లాడుకుందాం.

kamal hassan

కథ:

అయిదేళ్ళ తరువాత వచ్చిన విశ్వరూపం 2 కథ వసీమ్ (కమల్ హాసన్), అతని మీద ఆల్ ఖైదా నాయకుడు ఒమర్ జరిపిన దాడి గురించే చెబుతుంది. ఒమర్ తన గ్యాంగ్ తో కలిసి వసీమ్ కి వ్యతిరేఖంగా యుద్ధం మొదలుపెడతాడు. యునైటెడ్ నేషన్స్ లో, అలాగే ఇండియా లో బాంబు పేలుల్లకి వ్యూహం రచిస్తాడు. అయితే, ఆ బాంబు దాడులను వసీమ్ తన భార్య నిరుపమ(పూజా కుమార్), అస్మిత (ఆండ్రియా), కల్నల్ జగన్నాథ్ (శేఖర్ కపూర్) తో కలిసి ఎలా ఆపారు అన్నది, వారి మీద జరిగే దాడులను తప్పించుకొని ఎలా ఒమర్ ని ఓడించారు అన్నది తెర మీద చూడవలసిన తరువాత కథనం.

vishwaroopam2

పరిశీలన:

మామూలుగా హాలీవుడ్ రేంజ్ అనుభూతిని కలిగించే సినిమాలు మనకి చాలా తక్కువే. అయితే, ఆ తక్కువలో విశ్వరూపం ఉంటుందన్నది మనం చెప్పవచ్చు. అలాగే, టేకింగ్ విషయం లో విశ్వరూపం 2 కూడా ఏ మాత్రం తీసిపోకుండా కమల్ హాసన్ చాలా అద్భుతంగా తీసారు. కానీ, ఆ అద్భుతాన్ని చూపించే విషయం లో పడి కథని కొంచెం నిర్ల్యక్షం చేసినట్టు అనిపించింది. హీరో తన గ్యాంగ్ తో ఇండియా నుండి లండన్ కి, అక్కడ నుండి ఆఫ్గనిస్థాన్ కి, మళ్ళీ ఇండియా రావడం అనే ఎపిసోడ్ లు కొంచెం ప్రేక్షకుడిని అయోమయంలో పడేలా చేస్తాయ్. అద్భుతమయిన యాక్షన్ సీన్స్ అంత భీభత్సంగా ఉన్నా, కథనం కొంచెం సరిగ్గా లేదనేది వాస్తవం. విశ్వరూపం లో ఉన్న కొన్ని సందేహాలను ఈ సినిమాలో క్లియర్ చేసే పని సినిమా కి కొంచెం అనుకూలమయిన విషయమే. హీరో కి, ఆయన తల్లికి మధ్య ఉండే ఎమోషనల్ సీన్స్ చాలా బాగా అనిపించాయి.

Vishwaroopam-2

ఫస్ట్ హాఫ్ లో విశ్వరూపం లో వదిలేసినా కొన్ని వాటిని టచ్ చేస్తూ, దీన్ని రీ కనెక్ట్ చేస్తూ తీసిన ఎపిసోడ్ లు బాగానే ఉన్నా, కొంచెం సాగాతీసారేమో అన్న భావన మాత్రం వస్తుంది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే, హీరోయిన్స్ కూడా చేసే యాక్షన్ సన్నివేశాలతో, విలన్ గ్యాంగ్ కి, హీరో గ్యాంగ్ కి మధ్య జరిగే ఫైట్ కొంచెం హోరాహోరీగానే ఉంటుంది. కానీ, కేవలం యాక్షన్ సన్నివేశాలు ఉంటే సరిపోతుందా, ఇంకా కథలో బలం ఉంటే బావుండు అనిపిస్తుంది. సినిమాని ఎంతో దీక్షనంగా చూసేలా చేస్తారనుకుంటే కొంచెం నిరాశ పరిచారనే చెప్పాలి. నేపధ్య సంగీతం తేలిపోయిందనే చెప్పాలి. జరుగుతున్న కథనానికి వస్తున్న మ్యూజిక్ కి పొంతన లేనట్టుగా చూసేవాడికి అనిపిస్తుంది. పోల్చడం అని కాదు గానీ, విశ్వరూపం లో వెంట్రుకలు నిక్కబోడిచేలా ఉంటుంది మ్యూజిక్. ఆ ఊహలో వెళ్ళడం వల్ల ఏమోగానీ, ఇది అంత గొప్పగా అనిపించలేదు. కానీ, యాక్షన్ ఎలిమెంట్స్, సూపర్ టేకింగ్ అనుభూతిని పొందుదాం అనుకునేవాళ్ళకి ఈ సినిమా నచ్చే అవకాశం ఎక్కువే ఉంది.

Vishwaroopam-2-Movie

ఇక నటన గురించి మాట్లాడాలి అంటే ఆయన విశ్వ నటుడు, ఆయన గురించి చెప్పేదేముంటుంది, ఆయన ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ అఫ్ ఇండియన్ సినిమా. ఇక పూజా కుమార్, ఆండ్రియా వాళ్ళ యాక్షన్ స్టంట్స్ తో మంచి మార్కులే కొట్టేసారు. ఇక మిగతా వాళ్ళందరూ కూడా వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. ఎడిటింగ్ బావుంది, సినిమాటోగ్రఫీ సినిమాకి ప్లస్ పాయింట్.

మొత్తానికి, కమల్ హాసన్ గారిని ఇష్టపడేవాళ్ళు, యాక్షన్ కథనాలను ఎంజాయ్ చేద్దామనుకునే వాళ్ళు ఈ సినిమాని బ్రహ్మాండంగా చూడొచ్చు.

తెలుగు బుల్లెట్ రేటింగ్ – 2.25/5

తెలుగు బులెట్ పంచ్ లైన్ – ‘విశ్వరూపం’ కనబడలేదు…