అదే టైటిల్‌.. ఫస్ట్‌లుక్‌ వచ్చేస్తోంది…!

Akhil Next Film Titled As Mr. Majnu

అక్కినేని ప్రిన్స్‌ అఖిల్‌ మూడవ సినిమా కోసం ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చివరి దశ చిత్రీకరణ జరుపుకుంటుంది. అఖిల్‌ మొదటి రెండు చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. ఆ రెండు చిత్రాలు కూడా భారీ బడ్జెట్‌తో రూపొంది నిరాశ పర్చిన నేపథ్యంలో మూడవ సినిమాను కాస్త తక్కువ బడ్జెట్‌లో తెరకెక్కించడం జరిగింది. ‘తొలిప్రేమ’ వంటి విభిన్నమైన ప్రేమ కథతో విజయాన్ని దక్కించుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ చిత్రంను రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి మొదటి నుండి కూడా ‘మిస్టర్‌ మజ్ను’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లుగ వార్తలు వచ్చాయి. తాజాగా అదే విషయమై క్లారిటీ వచ్చేసింది.

Akhil Next Film Titled As Mr. Majnu

అఖిల్‌ మూడవ సినిమాకు ‘మిస్టర్‌ మజ్ను’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లుగా సమాచారం అందుతుంది. బివిఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా నిధి అగర్వాల్‌ నటిస్తుంది. విదేశాల్లో ఎక్కువగా ఈ చిత్రాన్ని షూట్‌ చేస్తున్నారు. ఈ చిత్రంకు మిస్టర్‌ మజ్ను అనే టైటిల్‌ అయితేనే బాగుంటుందని దర్శకుడు వెంకీ అట్లూరి భావిస్తున్నాడట. తాజాగా నిర్మాత ప్రసాద్‌ ఆ టైటిల్‌ను ఫిల్మ్‌ ఛాంబర్‌లో రిజిస్ట్రర్‌ చేయడం జరిగింది. గతంలో నాగార్జున మజ్ను అనే చిత్రాన్ని చేసి సక్సెస్‌ను దక్కించుకున్నాడు. ఇప్పుడు అదే టైటిల్‌తో అఖిల్‌ మూవీ సిద్దం అవుతున్నట్లుగా సమాచారం అందుతుంది. అఖిల్‌ మూవీ మిస్టర్‌ మజ్ను అని, ఆగస్టు 15న ఫస్ట్‌లుక్‌ రాబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. సినిమాను డిసెంబర్‌లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Akhil Next Film Titled As Mr. Majnu