అఖిల్‌ మిస్టర్‌ మజ్ను..!

Akhil Venky Atluri Movie Title as Mister Majnu

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

అక్కినేని ప్రిన్స్‌ అఖిల్‌పై ఫ్యాన్స్‌ చాలా ఆశలు పెట్టుకుని ఉన్నారు. కాని ఆ ఆశలను అఖిల్‌ తన మొదటి రెండు చిత్రాలతో నిలుపుకోవడంలో విఫలం అయ్యాడు. మొదటి చిత్రం ‘అఖిల్‌’ మరియు రెండవ చిత్రం ‘హలో’ చిత్రాలు అఖిల్‌కు స్టార్‌డంను తీసుకు రాలేక పోయాయి. ముఖ్యంగా మొదటి సినిమా ‘అఖిల్‌’ అట్టర్‌ ఫ్లాప్‌ అవ్వడంతో తీవ్రంగా నిరాశ చెందాడు. ప్రస్తుతం ‘తొలిప్రేమ’ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఒక చిత్రాన్ని అఖిల్‌ చేస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. తాజాగా ఈ చిత్రంకు టైటిల్‌న ఖరారు చేసినట్లుగా సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం కోసం ‘మిస్టర్‌ మజ్ను’ అనే టైటిల్‌ను ఎంపిక చేయడం జరిగిందని తెలుస్తోంది. అఖిల్‌తో ఒక మంచి ప్రేమ కథ సినిమాను వెంకీ తెరకెక్కిస్తున్నాడు. గతంలో నాగార్జున హీరోగా మజ్ను అనే చిత్రం తెరకెక్కిన విషయం తెల్సిందే. ఇప్పుడు మిస్టర్‌ మజ్ను అంటూ వెంకీ దర్శకత్వంలో అఖిల్‌ రాబోతున్నాడు. పవన్‌ సూపర్‌ హిట్‌ చిత్రం ‘తొలిప్రేమ’ చిత్రం టైటిల్‌ను వెంకీ తన మొదటి సినిమాకు పెట్టి సక్సెస్‌ను దక్కించుకున్నాడు. ఇప్పుడు రెండవ సినిమాకు సైతం నాగార్జున సూపర్‌ హిట్‌ చిత్రం అయిన మజ్నును ఎంపిక చేస్తున్నాడు. ఇప్పటికే నాని హీరోగా మజ్ను చిత్రం వచ్చింది కనుక మిస్టర్‌ అనే పదాన్ని తలిగించి ‘మిస్టర్‌ మజ్ను’ అంటూ అఖిల్‌ మూడవ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. మరి ఈ చిత్రం ఎలా ఉంటుందో చూడాలి అంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ చిత్రంతో అయినా అఖిల్‌ కమర్షియల్‌ సక్సెస్‌ను దక్కించుకుంటాడేమో చూడాలి.