నేను చెప్పినవన్ని అవుతాయి… కాస్త లేట్‌ అంతే!

Ram Gopal Varma confirm to make a movie with Akhil

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తెరకెక్కించిన ‘ఆఫీసర్‌’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. నాగార్జున పోలీస్‌ ఆఫీసర్‌గా నటించిన ఈ చిత్రం టీజర్‌ మరియు ట్రైలర్స్‌ సినిమాపై అమాంతం అంచనాలు పెంచేశాయి. అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుందనే నమ్మకంను వర్మ వ్యక్తం చేస్తున్నాడు. ఆ మద్య వివాదంలో వర్మ ఇరుక్కోవడంతో ఆఫీసర్‌ సినిమా అసలు విడుదల అవుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కాని వర్మ మాత్రం తాను అనుకున్నది అనుకున్నట్లుగా చేస్తాను అంటూ ప్రకటించాడు. తాజాగా ఆఫీసర్‌ సినిమా విడుదల సందర్బంగా మీడియాతో మాట్లాడిన వర్మ గతంలో తాను ప్రకటించిన సినిమాలు అన్ని చేస్తాను అంటూ మరోసారి గట్టిగా చెప్పాడు.

ముఖ్యంగా వర్మ ‘ఆఫీసర్‌’ తర్వాత అఖిల్‌తో ఒక సినిమాను చేస్తాను అంటూ ప్రకటించిన విషయం తెల్సిందే. ఆఫీసర్‌ సినిమా విడుదల అవుతుందో కాదో అనే అనుమానాల మద్య అఖిల్‌ సినిమా ఉండదు అంటూ తేల్చి పారేశారు. అయితే వర్మ మాత్రం తాను ఖచ్చితంగా అఖిల్‌తో సినిమా చేస్తాను అని, రెండు నెలల్లో సినిమాను ప్రారంభిస్తామని చెప్పుకొచ్చాడు. అఖిల్‌ కోసం ఒక మంచి సబ్జెక్ట్‌ను వర్మ తయారు చేసినట్లుగా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం వర్మ దర్శకత్వంలో హిందీలో ఒక సినిమా తెరకెక్కబోతుంది. ఆ సినిమా తర్వాత అఖిల్‌ సినిమా ఉంటుందేమో చూడాలి. ఇంకా వర్మ ప్రకటించిన పలు సినిమాలు కూడా త్వరలోనే మొదలు కాబోతున్నాయి. తనను టాలీవుడ్‌ నుండి బహిష్కరించాలని కొందరు భావిస్తున్నారు. అది ఎప్పటికి సాధ్యం కాదు అంటూ వర్మ తేల్చి చెప్పాడు.