బీజేపీని దెబ్బ కొట్టేందుకు సిద్దూ సూపర్ స్కెచ్ !

Siddaramaiah says i am not against a Dalit candidate as CM

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

కర్ణాటక రాజకీయాలు, సమీకరణలు ఊహకి కూడా అందనత వేగంగా శరవేగంగా మారుతున్నాయి. మూడు పార్టీల వారు ఎలాగైనా అధికార పీఠం దక్కించుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. నిన్న మొన్నటివరకూ అధికారంలోకి తిరిగి వస్తామని ధీమా వ్యక్తం చేసిన సిద్ధరామయ్య ఆదివారం నాడు కీలక ప్రకటన చేశారు. తాము అధికారంలోకి వస్తే దళితుడికి సీఎం పదవి ఇవాలని అధిష్టానం భావిస్తే తాను తప్పుకుని ఆ పదవి దళిత నేతకి ఇస్తానని ప్రకటించి ఆయన కలకలం రేపారు. ముఖ్యంగా జెడీఎస్ కింగ్ మేకర్ గా మారే అవకాశం ఎక్కువగా ఉండడంతో వారిని తమ వైపుకి తిప్పుకునేందుకు బిజెపి, కాంగ్రెస్ లు సన్నాహాలు చేస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ కీలక సమయంలో జెడీఎస్ అధినేత కుమారస్వామి సింగపూర్ వెళ్ళారు. కీలక చర్చలు సాగించేందుకే ఆయన అక్కడకు వెళ్లారని జెడీఎస్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అయితే ఈ ఉత్కంఠ 15వ తేదీ వరకూ కొనసాగనుంది. ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లు ఎవరికీ మెజారిటీ రాకపోతే 15 తర్వాత కూడా సస్పెన్స్ సాగే అవకాశం ఉంది.

ఒకవేళ హంగ్‌ వస్తే… జేడీఎస్‌ మద్దతు కోసం కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటినుంచి వ్యూహం సిద్ధం చేస్తోంది. జేడీఎస్‌ను తనవైపు తిప్పుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే ప్రస్తుత ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ నేత సిద్దరామయ్య కీలక ప్రకటన చేశారని భావిస్తున్నారు. దళిత ముఖ్యమంత్రి అంశంపై సిద్ధరామయ్య మరో ట్విస్ట్ కూడా ఇచ్చారు. తమ పార్టీ అధిష్టానం దళితుడిని ముఖ్యమంత్రిగా చేస్తే తమకు అభ్యంతరం లేదని చెబుతూ… గెలిచిన ఎమ్మెల్యేల మాట వినాలని, వారి అభీష్టం ప్రకారం ముందుకెళ్లాలని మెలిక పెట్టారు. జేడీఎస్ మద్దతు కోసమే సిద్ధరామయ్య దళిత సీఎం ప్రకటన చేసినట్లుగా భావిస్తున్నారు. ఎందకంటే కాంగ్రెసుకు సంపూర్ణ మెజారిటీ రాకపోతే జరుగబోయే పరిణామాలు ఇప్పుడు క్లియర్ గా ఉన్నాయి అనుకోవచ్చు జేడీయస్ కు కాంగ్రెస్ తో జట్టు కట్టడానికి ఉన్న ఓకే ఒక్క అడ్డంకి సిద్ధరామయ్య.

ఆయన సీఎం కాకుండా ఇంకెవరయినా అయితే జేడీయస్ కు ఎటువంటి అభ్యంతరం లేదట. దీంతో మాజీ కేంద్రమంత్రి, దళితనేత మల్లికార్జున ఖర్గే సీఎం కావడానికి మార్గం సుగమం అయ్యింది. సిద్ధరామయ్య వ్యతిరేక వర్గం మొదటి నుంచి ఈ ప్రతిపాదన చేస్తూ వస్తోంది అయితే మొదటి నుండి ధీమాగా ఉన్న కాంగ్రెస్ అధిష్టానం అన్ని మార్గాలను అవలోకనం చేసుకుని జేడీయస్ కు తమ ఆహ్వానాన్ని ఈ విధంగా తెలియజేసింది. తాము బీజేపీతో కలిసేది లేదని ఇప్పటికే జేడీఎస్ అధినేత దేవేగౌడ చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ అనూహ్య పరోక్ష ఆహ్వానానికి సంతోషంగా ఒప్పుకునే పరిస్థితి కనబడుతోంది. తమ డిమాండ్లకు మద్దతు ఇఛ్చిన పార్టీకే మద్దతు ఇవ్వాలనే ఆలోచనలో జెడీఎస్ ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ మెజార్టీ వస్తే ఏమిటి పరిస్థితి అనే అనుమానంతోనే అందరు ఎమ్మెల్యేలు అంగీకరించే వారు కావాలని మెలిక పెట్టారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.