రాజభవన్ కు చేరిన కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలు… లోపలికి అనుమతించని పోలీసులు !

Karnataka Police stops Kumaraswamy at Raj Bhavan

Posted May 16, 2018 (1 week ago) at 18:21

కర్ణాటక ఫలితాలు వెలువడినా ఏ పార్టీ కి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సంఖ్యా బలం లేకపోవడంతో ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. అందరి కంటే ఎక్కువ సీట్లు సాధించిన మాకే ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశమివ్వాలంటూ బీజేపీ, తమ కూటమికే సంఖ్యాబలం ఉన్నందున తమనే ఆహ్వానించాలని జేడీఎస్-కాంగ్రెస్ కూటమి గవర్నర్ ను కోరుతుండడం మరింత ఉత్సాహం రేపుతోంది. అయితే కొద్ది సేపటి క్రితం నేనే సీఎం అని రేపు ఉదయం ప్రమాణ స్వీకారం ఉంటుందని యడ్యూరప్ప ప్రకటన ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే ఇప్పుడే గవర్నర్ బాజూభాయ్ వాలాను కలిసి తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరేందుకు జేడీఎస్, కాంగ్రెస్ బృందం రాజభవన్ వద్దకు చేరుకుంది. జేడీఎస్ పార్టీ లెజిస్లేచర్ నేత, కాంగ్రెస్ పార్టీ లెజిస్లేచర్ నేత ఎన్నికకు సంబంధించిన రెండు లేఖలను గవర్నర్‌కు సమర్పించనున్నారని తెలుస్తోంది.

తమ వద్దనున్న అందరు ఎమ్మెల్యేలను తీసుకుని జేడీఎస్, కాంగ్రెస్ పార్టీలు రాజ భవన్ కు వస్తున్నట్టు తెలుస్తోంది. గవర్నర్ ఒప్పుకుంటే తమ ఎమ్మెల్యేల చేత పరేడ్ చేయించాలని ఒకవేళ కాంగ్రెస్-జేడీఎస్‍ కూటమిని గవర్నర్ ఆహ్వానించని పక్షంలో ఆ పార్టీల ఎమ్మెల్యేలంతా రాజ్‌భవన్ వెలుపల బైఠాయించి ధర్నా జరపాలని కూడా నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే కుమారా స్వామిని రాజ భవన్ లోకి పోలీసులు అనుమతించక పోవడం ఇప్పుడు పలు అనుమానాలకి తావిస్తోంది. కుమారస్వామికి లోపలి వెళ్లేందుకు అనుమతి లేదంటి అక్కడున్న భద్రతా అధికారులు అడ్డుకున్నారు. అయితే ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

SHARE