కాంగ్రెస్ కి ‘హ్యాండ్’ ఇచ్చిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ! హెలికాప్టర్ లు పంపిన బీజేపీ

Vijayanagara MLA Anand Singh and Bellary rural MLA nagendra supporting BJP

Posted May 16, 2018 (1 week ago) at 12:55

కర్ణాటక ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాటుకు కొద్ది దూరంలో నిలిచిపోయిన చూస్తున్న బీజేపీ… ఎలాగైనా సరే అధికారపీఠాన్ని అధిష్టించాలనే కృతనిశ్చయంతో ఉంది. ఈ నేపథ్యంలో, ఆ పార్టీ అధిష్టానం పెద్దలు ఇప్పటికే బెంగుళూరుకి చేరుకొని ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపినట్లు సమాచారం. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందుబాటులో లేకుండా పోయారని తెలుస్తోంది. కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశానికి వీరు డుమ్మా కొట్టారు. ఇద్దరు జేడీఎస్ ఎమ్మెల్యేలు కూడా అందుబాటులో లేరని సమాచారం. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విజయనగర ఎమ్మెల్యే ఆనంద్‌సింగ్‌, బళ్ళారి రూరల్ ఎమ్మెల్యేలు నాగేంద్రలు బీజేపీకి మద్దతు ప్రకటించినట్టు విశ్వసనీయ సమాచారం. వీరి కోసం వీరున్న ప్రాంతాలకు బీజేపీ అధిష్ఠానం ప్రత్యేక హెలికాప్టర్లను పంపినట్టు తెలుస్తోంది.

అయితే ఇప్పుడు గోడ దూకుతారు అని ప్రచారం జరుగుతున్న ఎమ్మెల్యేలు ముందు బీజేపీ నుండి వచ్చిన వారే. ఇద్దరూ గాలి వర్గానికి చెందినా వారే. బీజేపీ ఎంపీ శ్రీరాములుకు ముఖ్యఅనుచరుడిగా ఉంటూ 2013 శాసన సభ ఉన్నికల్లో కూడ్లగిలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యే అయిన బి. నాగేంద్ర ఈ ఏడాది ఫిబ్రవరిలోనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నాడు. అదే కోవలో గాలి వర్గానికే చెందినాహసపేట బీజేపీ ఎమ్మెల్యే ఆనంద్‌సింగ్‌ కూడా కాంగ్రెస్ లో చేరి విజయనగర టికెట్ సాధించి గెలిచాడు, అయితే ఎటూ గాలి వర్గానికి చెందిన వ్యక్తులు కావడంతో బీజేపీ వారిని బెంగుళూరుకి రప్పించేందుకు ప్రత్యేక హెలికాప్టర్లను సైతం పంపినట్లు వార్తలు వస్తున్నాయి.

SHARE