నేడు 13 ఐటీ కంపెనీలు ప్రారంభించిన లోకేష్…6900 మందికి ఉద్యోగాలు…!

Minister Nara Lokesh To Launch 13 IT Companies At Vizag

రాష్టాన్ని ఐటీ హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వం విశేష కృషి చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ విశాఖపట్నంలో కొత్తగా ఏర్పాటు చేసిన 13 ఐటీ కంపెనీలను ఈరోజు ప్రారంభించారు. వీటితో పాటు మరో నాలుగు కంపెనీల విస్తరణ కార్యక్రమాల్లో ఆయన ఈరోజు పాల్గొంటారు. ఈరోజు నారా లోకేష్ ప్రారంభించిన 13 కంపెనీల వివరాలు

Minister Nara Lokesh To Launch 13 IT Companies At Vizag
1.సిఈఎస్ లిమిటెడ్ (CES Limited) – ఈ కంపెనీ ద్వారా 110 ఉద్యోగాలు యువతకు లభ్యం కానున్నాయి. ప్రస్తుతం సిఈఎస్ లిమిటెడ్ బిజినెస్ ప్రోసెస్ మ్యానేజ్మెంట్ సర్వీసెస్ అందిస్తోంది.
2.సెరియం సిస్టమ్స్ (cerium systems pvt ltd) – ఈ కంపెనీ ద్వారా 1000 ఉద్యోగాలు యువతకు లభ్యం కానున్నాయి. ప్రస్తుతం సెరియం సిస్టమ్స్ విఎల్ఎస్ఐ అండ్ ఎంబెడెడ్ సాఫ్ట్ వేర్ సెక్టర్ కి గ్లోబల్ డిజైన్ సర్వీసెస్ అందిస్తోంది.
3.సహస్రమయ టెక్నాలజిస్ (sahasramaaya technologies inc) ఈ కంపెనీ ద్వారా 500 ఉద్యోగాలు యువతకు లభ్యం కానున్నాయి. ప్రస్తుతం సహస్రమయ టెక్నాలజిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్,మెషీన్ లెర్నింగ్,ఐఓటి,బ్లాక్ చైన్ టెక్నాలజి సర్వీసెస్ అందిస్తోంది.
4.వెలాంటా కెపిఓ అకౌంటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ – ఈ కంపెనీ ద్వారా 44 ఉద్యోగాలు యువతకు లభ్యం కానున్నాయి. ప్రస్తుతం వెలాంటా కెపిఓ అకౌంటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అందిస్తోంది.
5.బెల్ ఫ్రిక్స్ క్రిప్టెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ (belfrics cryptex pvt ltd) – ఈ కంపెనీ ద్వారా 22 ఉద్యోగాలు యువతకు లభ్యం కానున్నాయి. ప్రస్తుతం బెల్ ఫ్రిక్స్ క్రిప్టెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ డిజిటల్ వ్యాలెట్ సర్వీసెస్ అందిస్తోంది.
6.స్వేయ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ (sweya information technologies LLP) – ఈ కంపెనీ ద్వారా 50 ఉద్యోగాలు యువతకు లభ్యం కానున్నాయి. ప్రస్తుతం స్వేయ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ఎంబెడెడ్ సాఫ్ట్ వేర్,వెబ్ మరియు మొబైల్ యాప్స్ సర్వీసెస్ అందిస్తోంది.
7.ఇన్ డేటా అనలిటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ (inn data analytics pvt ltd) – ఈ కంపెనీ ద్వారా 32 ఉద్యోగాలు యువతకు లభ్యం కానున్నాయి. ప్రస్తుతం ఇన్ డేటా అనలిటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ గవర్నెన్స్ సర్వీసెస్ అందిస్తోంది.
8.హెచ్ఆర్ స్క్వేర్ స్టాఫింగ్ సొల్యూషన్స్( hr square staffing solutions) – ఈ కంపెనీ ద్వారా 100 ఉద్యోగాలు యువతకు లభ్యం కానున్నాయి. ప్రస్తుతం హెచ్ఆర్ స్క్వేర్ స్టాఫింగ్ సొల్యూషన్స్ ఎండ్ టూ ఎండ్ హెచ్ఆర్ సర్వీసెస్ అందిస్తోంది.
9.ఇన్సోటీం కన్సల్టింగ్ సర్వీసెస్ (inso team consulting services ) – ఈ కంపెనీ ద్వారా 75 ఉద్యోగాలు యువతకు లభ్యం కానున్నాయి. ప్రస్తుతం ఇన్సోటీం కన్సల్టింగ్ సర్వీసెస్ బిజినెస్ సొల్యూషన్స్,ప్రాజెక్ట్ మ్యానేజ్మెంట్ స్కిల్స్,సాఫ్ట్ వేర్ డేవేలప్మెంట్ సర్వీసెస్ అందిస్తోంది.
10.న్యూవి సొల్యూషన్స్ (nueve solutions LLC) – ఈ కంపెనీ ద్వారా 32 ఉద్యోగాలు యువతకు లభ్యం కానున్నాయి. ప్రస్తుతం న్యూవి సొల్యూషన్స్ చిన్న వ్యాపారాలకు వెబ్ అప్లికేషన్స్ సర్వీసెస్ అందిస్తోంది.
11.వివిలెక్స్ టెక్నాలజిస్ (vivilex technologies pvt ltd) – ఈ కంపెనీ ద్వారా 100 ఉద్యోగాలు యువతకు లభ్యం కానున్నాయి. ప్రస్తుతం వివిలెక్స్ టెక్నాలజిస్ హై క్వాలిటీ సాఫ్ట్ వేర్ డేవేలప్మెంట్, బిపిఓ సర్వీసెస్ అందిస్తోంది.

Minister Nara Lokesh To Launch 13 IT Companies At Vizag
12.ఎన్వోయ్ మోర్ట్గేజ్ (envoy mortgage) – ఈ కంపెనీ ద్వారా 60 ఉద్యోగాలు యువతకు లభ్యం కానున్నాయి. ప్రస్తుతం ఎన్వోయ్ మోర్ట్గేజ్ మోర్ట్గేజ్ బ్యాంకింగ్ సర్వీసెస్ సర్వీసెస్ అందిస్తోంది.
13.హిప్పో క్యాంపస్(hippo campus) ఈ కంపెనీ ద్వారా 250 ఉద్యోగాలు యువతకు లభ్యం కానున్నాయి. ప్రస్తుతం హిప్పో క్యాంపస్ ఈ గవర్నెన్స్ సర్వీసెస్ అందిస్తోంది.
ఇక విస్తరణ చేయనున్న కంపెనీల విషయానికి వస్తే
1.సింబయోసిస్ (symbiosis ) ఈ కంపెనీ ద్వారా 100 ఉద్యోగాలు యువతకు లభ్యం కానున్నాయి. ప్రస్తుతం సింబయోసిస్ ఆఫ్ షోర్ డెవలప్మెంట్ సర్వీసెస్ అందిస్తోంది.
2.ఇన్స్ పైర్ ఎడ్జ్ ఐటీ సొల్యూషన్స్ (inspire edge it solutions pvt ltd ) ఈ కంపెనీ ద్వారా 200 ఉద్యోగాలు యువతకు లభ్యం కానున్నాయి. ప్రస్తుతం ఇన్స్ పైర్ ఎడ్జ్ ఐటీ సొల్యూషన్స్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్,టెలికాం ఎక్సపెన్స్ మ్యానేజ్మెంట్ సర్వీసెస్ అందిస్తోంది.
3.కాన్డ్యూయెంట్ (conduent ) ఈ కంపెనీ ద్వారా 5000 ఉద్యోగాలు యువతకు లభ్యం కానున్నాయి. ప్రస్తుతం కాన్డ్యూయెంట్ బీపీఓ సర్వీసెస్ అందిస్తున్నఅందిస్తోంది.
4. పాత్రా ఇండియా బిపిఓ సర్వీసెస్ ( patra india bpo services pvt ltd ) ఈ కంపెనీ ద్వారా 1600 ఉద్యోగాలు యువతకు లభ్యం కానున్నాయి. ప్రస్తుతం పాత్రా ఇండియా బిపిఓ సర్వీసెస్ బిపిఓ సర్వీసెస్ అందిస్తోంది.

ఈ సంస్థల ద్వారా 6900 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.