విజయ్‌కి ఇది మరో అర్జున్‌ రెడ్డి అంటా!

vijay devarakonda and rashmika mandanna’s Publicity Stunt On Twitter

విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ‘అర్జున్‌ రెడ్డి’కి అవార్డుల పంట పండటం జరిగింది. కలెక్షన్స్‌తో పాటు విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న అర్జున్‌ రెడ్డి తాజాగా ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డును కూడా దక్కించుకున్నాడు. అర్జున్‌ రెడ్డి చిత్రంలో మంచి నటనకు గాను బెస్ట్‌ యాక్టర్‌ అవార్డును ఫిల్మ్‌ ఫేర్‌ నుండి విజయ్‌ దేవరకొండ అందుకున్న విషయం తెల్సిందే. ఇక ఈయన ప్రస్తుతం వరుసగా చిత్రాలతో వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ‘ట్యాక్సీవాలా’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. త్వరలోనే సినిమాను విడుదల చేయబోతున్నారు. ఇక ఆ సినిమా విడుదలైన నెల రోజుల్లోనే మరో సినిమాతో వచ్చేందుకు సిద్దం అవుతున్నాడు. తాజాగా ఆ సినిమాకు టైటిల్‌ను ఖరారు చేయడం జరిగింది. రష్మిక హీరోయిన్‌గా రూపొందుతున్న చిత్రానికి ‘గీత గోవిందం’ అనే టైటిల్‌ను ఖరారు చేయడం జరిగింది.

ఈ టైటిల్‌ ప్రకటన చాలా విభిన్నంగా చిత్ర యూనిట్‌ సభ్యులు ప్లాన్‌ చేశారు. హీరో హీరోయిన్స్‌ ట్విట్టర్‌ ద్వారా ఈ టైటిల్‌ను రివీల్‌ చేయడం జరిగింది. వీరిద్దరి మద్య ఆసక్తికర, ఫన్నీ ఛాటింగ్‌తో టైటిల్‌ను రివీల్‌ చేయడం జరిగింది. ఈ చిత్రంలో గోవిందంగా విజయ్‌ కనిపించనుండగా, గీతగా హీరోయిన్‌ రష్మిక కనిపించబోతుంది. విజయ్‌, రష్మికల మద్య ట్విట్టర్‌లో సాగిన సంభాషణ ఇది.
….
గీత: ఫిలింఫేర్ బెస్ట్ యాక్టర్ అంట కదా.. కంగ్రాట్స్ గోవింద్
గోవిందం : మేడమ్.. గీతా మేడమ్.. మీతో టైం గడపడం నాకు నిజంగా అవార్డు. ఇవి వస్తుంటాయ్, పోతుంటాయ్.
గీత : ఇదిగో గోవిందం, ఈ ఓవరాక్షనే తగ్గించుకోమనేది. అసలు నీకు కాదు, ప్రభాస్ కో తారక్ కో ఇస్తే ఈ గొడవ పోయేది
గోవిందం : అవార్డులో ఏముంది మేడమ్, మీలాంటి వాళ్లు నన్ను ప్రేమించడం చాలు.
గీత : నా లాంటి వాళ్లా..? వాళ్లు ఏంటి? ఆ బహువచనం ఏంటి? తెలుసులే నీ గురించి. ఒక్కరు సరిపోరు. ఎవర్నీ వదలవుగా.
గోవిందం: నా ఉద్దేశం అది కాదు మేడమ్, నన్ను ఓసారి 23న కలవండి మేడం. అన్నీ వివరిస్తా.

భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాను గీతాఆర్ట్స్‌ 2 బ్యానర్‌లో బన్నీ వాసు నిర్మిస్తున్నాడు. పరుశురామ్‌ దర్శకత్వంలో కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంతో విజయ్‌ మరోసారి భారీబ్లాక్‌ బస్టర్‌ను దక్కించుకోవడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు నమ్మకంగా చెబుతున్నారు. 23 న చిత్ర ఫస్ట్ లుక్ కు ప్లాన్ చేసారు.