నయన్‌ తన ప్రేమను నిరూపించుకుంటుంది

Nayanthara Express Her Love On Vignesh

తమిళంలో స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార తెలుగులో కూడా పలు చిత్రాల్లో నటించి ఇప్పటికి కూడా సీనియర్‌ స్టార్‌ హీరోలకు మోస్ట్‌ వాంటెడ్‌గా హీరోయిన్‌గా ఉంది. ఇలాంటి నయతార సౌత్‌లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్‌గా గుర్తింపు దక్కించుకుంది. ఈమె చేసే ప్రతి సినిమాకు కూడా మంచి లాభాలు దక్కుతున్న సమయంలో నిర్మాతలు ఈమె వెంట పడుతున్నారు. ఇలాంటి సమయంలో ఈమె స్వయంగా నిర్మాతగా మారేందుకు సిద్దం అయ్యింది. అది కూడా తన ప్రేమికుడు విఘ్నేషన్‌ కోసం ఈమె నిర్మాణంలోకి అడుగు పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. చాలా రోజులుగా విఘ్నేషన్‌తో ప్రేమలో మునిగి తేలుతున్న నయనతార ప్రస్తుతం ఆయన కోసం సినిమాను నిర్మించేందుకు సిద్దం అయ్యింది.

విఘ్నేషన్‌ దర్శకత్వంలో ఒక చిత్రం రూపొందబోతుంది. ఆ సినిమాను మొదట వేరే దర్శకుడు తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు. కాని ఆయన మద్యలోనే ప్రాజెక్ట్‌ను వదిలేయడంతో ఆ ప్రాజెక్ట్‌ను నయన్‌ నెత్తికి ఎత్తుకున్నట్లుగా సమాచారం అందుతుంది. త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాబోయే భర్త కోసం కాస్త ఎక్కువ బడ్జెట్‌ను సైతం పెట్టేందుకు ఈమె సిద్దంగా ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. నయనతార ప్రస్తుతం తమిళంలో రెండు మూడు సినిమాల్లో నటిస్తుంది. తెలుగులో వెంకటేష్‌ సరసన ఒక చిత్రంలో, చిరంజీవి సరసన సైరా చిత్రంలో నటిస్తుంది. హీరోయిన్‌గా బిజీగా ఉన్న సమయంలో నిర్మాణం అంటే కాస్త సాహసమే అని చెప్పుకోవచ్చు. అయినా కూడా నయన్‌ సాహసంకు సిద్దం అవుతుంది.