గీతా మాధురి సంచలన నిర్ణయం…!

Geetha Madhuri Will Going Take Legal Action Against

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 2 రన్నరప్‌ గీతా మాధురిపై సోషల్‌ మీడియాలో ముఖ్యంగా యూట్యూబ్‌లో కొన్ని ఛానెల్స్‌ తీవ్రమైన కామెంట్స్‌ చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఆమె చట్టపరమైన చర్యలకు సిద్దం అయ్యింది. తన పరువుకు భంగం కలిగించేలా పోస్ట్‌లు పెట్టిన యూట్యూబ్‌ ఛానెల్స్‌ పై త్వరలో లీగల్‌ చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతున్నట్లుగా ప్రకటించింది. సోషల్‌ మీడియాలో గీతా మాధురి ఈ విషయాన్ని ప్రకటించింది. గత కొన్ని రోజులుగా గీతా మాధురి మరియు సామ్రాట్‌ల గురించి పలు పుకార్లు షికార్లు చేస్తున్న విషయం తెల్సిందే. ఆ విషయమై గీతా మాధురికి ఆగ్రహం తెప్పించింది.

geetha-madhuri

గీతా మాధురి తాజాగా బిగ్‌బాస్‌ రన్నరప్‌గా నిలిచిన సంతోషంలో ఉంది. ఆ సమయంలోనే ఆమె కెరీర్‌ విషయంలో మరియు వ్యక్తిగతంగా కూడా సోషల్‌ మీడియా పోస్ట్‌లు ఇబ్బందిగా మారాయి. దాంతో ఈమె తనపై పుకార్లు పుట్టించిన వారిపై చర్యలకు సిద్దం అయ్యింది. రెండు రోజుల్లో తనపై ఉన్న పోస్ట్‌లను తొలగించాలని, లేదంటే తీవ్రమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆమె హెచ్చరించింది. పోలీసులకు ఫిర్యాదు ఇస్తానంటూ గీతా మాధురి ప్రకటించిన నేపథ్యంలో ఆమె గురించి యూట్యూబ్‌ ఛానెల్స్‌ వారు వీడియోలను తొలగిస్తారేమో చూడాలి.

geetha