యానిమల్ ట్రైలర్ కోసం సిద్ధంగా ఉండండి!

యానిమల్ ట్రైలర్ కోసం సిద్ధంగా ఉండండి!
Cinema News

అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యానిమల్ సినిమా థియేట్రికల్ ట్రైలర్ విడుదలకు సంబంధించిన అప్డేట్ మాత్రం వచ్చింది. బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ మరియు రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా కి టాలీవుడ్ సెన్సేషన్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. ఈ సినిమా డిసెంబర్ 1, 2023 న ప్రధాన భారతీయ భాషలలో థియేటర్ల లో రిలీజ్ కానుంది.

యానిమల్ ట్రైలర్ కోసం సిద్ధంగా ఉండండి!
Animal Cinema

చిత్ర దర్శకుడు, సందీప్ రెడ్డి వంగా ట్రైలర్ రిలీజ్ కి సంబందించిన అప్డేట్ ను ఒక పోస్టర్ ద్వారా వెల్లడించారు. నవంబర్ 23, 2023న యానిమల్ ట్రైలర్‌ను ఆవిష్కరించనున్నట్టు అందులో తెలియచేసారు . ఈ పోస్టర్ లో రణబీర్‌తో కలిసి ఉన్నారు డైరెక్టర్ సందీప్. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. అనిల్ కపూర్ మరియు బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా ని టి-సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ పై నిర్మించడం జరిగింది.