అమర్ అక్బర్ ఆంథోనీ అప్డేట్: ఇలియానా బర్త్ డే పోస్టర్…!

Goa Beauty Ileanas Birthday Wishes Poster From Team Amar Akbar Anthony

ఇలియానా అంటే తెలుగు కుర్రకారు హృదయాలకు ఎంత క్రేజో తెలియనిది కాదు. దేవదాసు సినిమాతో తెలుగు తెరకు పరిచయం అవుతూనే, తెలుగు కుర్రాళ్లందరిని తన దేవదాసులుగా చేసుకున్న ఇలియానా, తన రెండో సినిమా పోకిరి తో స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆ తరువాత కిక్ సినిమాతో నషాళాన్ని తాకే కిక్కు ఇచ్చిన ఇలియానా, తన ఖాతాలో జల్సా, జులాయి వంటి హిట్ సినిమాలతో పాటు, శక్తి, సలీం, దేవుడు చేసిన మనుషులు వంటి భారీ ప్లాపులను జమ చేసుకుంది. రవితేజ తో ఖతర్నాక్, కిక్, దేవుడు చేసిన మనుషులు అంటూ మూడు సినిమాలు చేసిన ఇలియానా, 2012 లో బర్ఫీ సినిమాతో హిందీలోకి వెళ్లి మళ్ళీ తెలుగు వైపు చూడలేదు.

iliyana-movies

మళ్ళీ, ఇంతకాలానికి సుమారు 6 సవంత్సరాల తరువాత రవితేజ సినిమా అమర్ అక్బర్ ఆంథోనీ తో తెలుగు లోకి రీ-ఎంట్రీ ఇచ్చింది. శ్రీను వైట్ల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ విడుదల అయ్యాక, ఎన్నాళ్ల నుండో తమ అభిమాన దేవతని చూడబోతున్నామన్న ఇలియానా అభిమానుల మొహాల్లో ఆనందం బదులు ఆశ్చర్యం తొంగిచూసింది. బొద్దుగా, హీరోయిన్ నమిత కి చెల్లి లా కనిపిస్తున్న ఇలియానా ని చూసిన ప్రేక్షకులు తాము చూసిన ఆ సన్నని నడుము ఎక్కడా అని వెతుకుంటున్నారు. కొందరైతే ఇలియానా ప్రెగ్నంట్ అని సోషల్ మీడియా లో రాసుకొని, షేర్ చేసుకుంటున్నారు.

iliyana

ఇవన్నీ పక్కనపెడితే, ఈరోజు ఇలియానా 30 వ పుట్టినరోజు. ఈ సందర్భంగా అమర్ అక్బర్ ఆంథోనీ సినిమాని నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ తమ ట్విట్టర్ అకౌంట్లో ఇలియానాకి సంబంధించిన మూవీ స్టిల్ తో పోస్టర్ డిజైన్ చేసి, విడుదల చేశారు. ఈ సినిమా నవంబర్ 16 న విడుదల అవుతుంది.

Amar Akbar Antony First Look