అక్ష‌య‌తృతీయ సంద‌ర్భంగా బంగారం ధ‌ర‌కు చుక్క‌లు

Gold Jewellery Rates increase because of Akshaya Tritiya

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అక్ష‌య‌తృతీయ నేప‌థ్యంలో బంగారం ధ‌ర‌లు చుక్క‌ల‌నంటుతున్నాయి. నేటి బులియ‌న ట్రేడింగ్ లో ప‌దిగ్రాముల బంగారం ధ‌ర రూ. 300 పెరిగి రూ 32,150కి చేరింది. అక్ష‌య తృతీయ కోసం న‌గ‌ల వ్యాపార‌స్థుల నుంచి కొనుగోళ్లు పెర‌గ‌డంతో ప‌సిడి ధ‌ర పైపైకి పోతోంది. అంత‌ర్జాతీయంగానూ డిమాండ్ పెర‌గ‌డం… బంగారం పెరుగుద‌ల‌కు మ‌రో కార‌ణం.

అక్ష‌య తృతీయ సంద‌ర్భంగా వినియోగ‌దారుల‌ను ఆక‌ర్షించేందుకు స్థానిక ఆభ‌ర‌ణాల త‌యారీదారులు భారీ ఆఫ‌ర్లు ప్ర‌క‌టిస్తున్నారు. నెల‌వారీ ప‌థ‌కాలు, త‌రుగు త‌గ్గింపు, వివిధ మోడ‌ల్స్ పై రాయితీ వంటి ఆఫ‌ర్లు అందిస్తున్నాయి. అటు అంత‌ర్జాతీయంగానూ బంగారం ధ‌ర పెరిగింది. న్యూయార్క్ మార్కెట్లో ఔన్సు బంగారం ధ‌ర 1.02 శాతం పెరిగి 132.80 డాల‌ర్లుగా ఉంది. వెండి ధ‌ర కూడా బంగారం బాటలోనే ప‌య‌నిస్తోంది. కిలో ధ‌ర రూ. 240 పెరిగి రూ. 40వేల‌కు చేరింది. పారిశ్రామిక వ‌ర్గాలు, నాణేల త‌యారీదారుల నుంచి వెండికి డిమాండ్ బాగా పెరిగింది.