పెరిగిన పసిడి ధర

పెరిగిన పసిడి ధర

వడ్డీరేట్లు ఇప్పుడే పెంచబోమంటూ యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ ప్రకటించిన కాసేపటికే ఫ్యూచర్స్‌ బంగారం ధర పెరిగింది. మల్టీ కమోడిటీ ఎక్స్‌ఛేంజ్‌(ఎంసీఎక్స్‌)లో ఆగష్టు ఫ్యూచర్స్‌లో 10 గ్రాముల బంగారం ధర ప్రారంభంలో 47011 నుంచి 47,091కి చేరుకుంది.

వెండికి సంబంధించి జులై ఫ్యూచర్స్‌లో కిలో వెండి ధర 67,515 నుంచి 67,819కి చేరుకుంది.ఇటీవల బంగారం ధరలు తగ్గడంతో దేశీయంగా కొనుగోళ్లు పెరిగాయి. మిగిలిన దేశాలతో పోల్చితే బంగారం మార్కెట్‌ ఇండియాలో మెరుగ్గానే ఉంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 47,312గా నమోదు అవగా కిలో వెండి 68,198గా ఉంది.