జీరో వడ్డీ పథకాన్ని పునః ప్రారంభించనున్న జగన్

జీరో వడ్డీ పథకాన్ని పునః ప్రారంభించనున్న జగన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహమ్మారి కరోనా దారుణంగా విస్తరిస్తున్న తరుణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నో కీలకమైన నిర్ణయాలను తీసుకుంటున్నారు. కాగా అయినప్పటికీ కూడా 647 కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు అందిన వివరాల ప్రకారం కర్నూలు జిల్లాలో అత్యధికంగా 158 కేసులు నమోదయ్యాయి. అయితే కరోనా వైరస్ వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని సీఎం జగన్ తాజాగా మరొక సంచలనమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. కాగా క్లిష్టతరమైన పరిస్థితుల్లో ప్రజలందరినీ ఆదుకోవడానికి రాష్ట్రంలోని 93 లక్షల మంది మహిళలకు అండగా ఉండేందుకు సీఎం జగన్ నిర్ణయించుకున్నారు.

కాగా ఈ నెల 24వ తేదీన సీఎం జగన్ రాష్ట్రంలో జీరో వడ్డీ పథకాన్ని పునః ప్రారంభించనున్నారు. అయితే ఈ పథకం వల్ల పొదుపు సంఘాలకు 1400 కోట్ల రూపాయల వరకు ప్రజలకు ప్రయోజనం చేకూరనుంది. కాగా తాజా సమాచారం ప్రకారం నేటి నుండి రాష్ట్రంలో కొన్నింటికి లాక్ డౌన్ సడలింపులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే మహమ్మారి కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో విధించిన రెడ్ జోన్లు మినహా ఇతర ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యకలాపాలకు సీఎం జగన్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.