రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్

good news for railway passengers

ఇండియన్ రైల్వేస్ ట్రైన్ ప్యాసింజర్లకు తీపికబురు అందించింది. అన్ని ట్రైన్లలోనూ జీపీఎస్ (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్) వ్యవస్థను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. 2020 మార్చి కల్లా ఈ పని పూర్తి చేస్తామని తెలిపింది. రియల్‌ టైమ్ ఇన్‌ఫర్మేషన్ సిస్టమ్ (ఆర్‌టీఐఎస్) కార్యక్రమంలో భాగంగా ఈ చర్య తీసుకుంటామని పేర్కొంది. ‘జీపీఎస్ పరికరాలను ఇప్పటికే 4,200 ట్రైన్లలో ఏర్పాటు చేశామని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరకు అన్ని రైళ్లలోనూ వీటిని ఏర్పాటుచేస్తామని వీటిసాయంతో ట్రైన్ ఎక్కడ ఉందో రియల్‌ టైమ్‌లో తెలుసుకోవచ్చని రైల్వే బోర్డు చైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ తెలిపారు. ప్రయాణికులు కొన్ని సెకన్లలోనే ట్రైన్స్ రన్నింగ్ స్టేటస్ తెలుసుకునేందుకు ఉద్దేశించిన ఆర్‌టీఐఎస్ ప్రాజెక్టు అమలుకు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్త్రో)‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని వివరించారు. ఆర్‌టీజీఎస్ ట్రైన్ కదలికలను ప్రతి 30 సెన్లకు రికార్డ్ చేస్తుంది. దీన్ని విప్లవాత్మకమైన చర్యగా భావించొచ్చు. ట్రైన్ సమయపాలనకు మెరుగుపడుతుంది. ప్రయాణికులకు ట్రైన్ టైమింగ్స్‌ కచ్చితంగా తెలియజేయవచ్చు.