మూన్ ల్యాండింగ్‌.. డూడుల్‌ వీడియో చూడాల్సిందే

google doodle celebrates 50th anniversary of first moon landing

జూలై 20, 1969. అమెరికా వ్యోమ‌గాములు నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్‌, ఎడ్విన్ బుజ్ ఆల్డ్రిన్‌.. ఈ ఇద్ద‌రూ చంద్రుడిపై అడుగుమోపిన రోజు అది. ఆ అద్భుత క్షణాల‌ను ఇవాళ గూగుల్ సంస్థ త‌న డూడుల్ వీడియోతో ప్ర‌జెంట్ చేసింది. అపోలో 11 మిష‌న్‌లో వెళ్లిన మ‌రో ఆస్ట్రోనాట్ మైక్ కొలిన్స్ ఆ వీడియోను వివ‌రించారు. యానిమేష‌న్ వీడియో అద్భుతంగా ఉంది. అపోలో 11 జ‌ర్నీని ఆ డూడుల్ వీడియోలో కొలిన్స్ క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు వివ‌రించారు. చంద్రుడిపై దిగిన ఇద్ద‌రు వ్యోమ‌గాములు అక్క‌డ సుమారు 21 గంట‌ల పాటు గ‌డిపారు. గూగుల్ రూపొందించిన డూడుల్ వీడియోను ప్ర‌తి ఒక్క‌రూ క‌చ్చితంగా చూడాల్సిందే. ఇదే ఆ వీడియో.